Friday, February 29, 2008

అనగనగా ఒక రోజు ........

లైఫ్‌లో కొన్ని వారాలు లేదా నెలలు ఏమీ తేడా లేకుండా ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఒక్కరోజులో ఎన్నో సంఘటనలు వెంటనే, వెంటనే జరిగిపోతాయి..... అలాంటిదే మొన్నటి నా లాస్ట్ వర్కింగ్ డే.

పదింటికి లాస్ట్ డే ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి మయ ఆఫీసు ప్రధాన శాఖకి వెళ్ళాను. వెళ్ళి ఒక ఏడాది అయ్యింది...నా ట్రైనింగ్, మొదటి రెండు ప్రాజెక్టులు అక్కడే...ఎక్కడకి వెళ్ళినా ఏదో జ్ఞాపకం సినిమాల్లో చూపించనట్టు....
అన్నిచోట్లా వెతుక్కోవడమే ఎవ్వరిన తెల్సిన వాళ్ళు కనిపిస్తారు ఏమో అని. అన్ని అయ్యాక, మానవ వనరుల శాఖ వారు వెళ్లే ముందు మీ అమూల్యమైన అభిప్రాయాలు కావాలి అన్నారు. సరే మీ కర్మ అని ఒప్పుకున్నాను. నా నోటీకొచ్చింది నేను చెప్తే, ఆమె చేతికి వచ్చింది ఆమె రాసుకోండి. అంతా అయ్యాక నీ రాజీనామా ఇచ్చి రెండు నెలలు అయినట్టు నాకు తెలియదు (అవ్వ..ఇది మా మానవ శాఖ పనితీరు) అంది. నువ్వు సరిగ్గా ఆలోంచించకుండా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆలోచించుకోవడానికి ఒకరోజు టైమ్ ఇస్తాము. ఉంటే జీతం పెంచుతాము, అమెరికా పంపుతాం అంది. ఐనా ఇదంతా నీకోసమే చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు.మాకొచ్చే నష్టమేమీ లేదు అంది. వాళ్ళ దయాహృదయానికి నా గుండె చెరువు అయిపోయింది. అంతటి కరుణ, జాలి(???) పొందడానికి నాకు అర్హత లేదనిపించింది. మొత్తానికి వారి యొక్క సదా మీ సేవలోకార్యక్రమం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం నాలుగు అయ్యింది.

ఇక అప్పుడు కెమెరా తీసుకుని మా ఆఫీసుని, జనాలని బంధించే పని మొదలుపెట్టాను. మా అన్నయ్య అంటూ ఉంటాడు. చదవడామైతే నాలుగేళ్ళు ఎలక్ట్రానిక్స్ చదివావు కానీ నీకు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉపయోగించటంలో కొంచెం కూడా సెన్స్ ఉండదే అని. విషయాన్ని మరొక్క సారి నిరూపిస్తూ,ఆఫీసు మధ్యలో నిలబడి,ఫ్లాష్ ఆన్ చేసి మరీ టప టప మంటూ పది ఫోటోలు నొక్కెసాను. దెబ్బకి ఎక్కడో మూల తన మానాన తాను నిద్రపోతున్న సెక్యూరిటీ అతను లేచి, మూల నుంచి మూలకి వినపడేటట్లు గట్టిగా అరిచాడు మేడమ్ అంటూ. ఇక్కడ తియ్యకూడదు మేడమ్ అంటూ, నా బుజ్జి కేమెరాని తీసేసుకున్నాడు. మళ్లీ ఇవ్వమంటే, నాకె దురుద్దేశం లేధని లెటర్ రాసి, పది సాక్షి సంతకాలు పెట్టిస్తే అప్పుడు ఇస్తడట. వార్నీ, మరీ గజ దొంగాలానో, తీవ్రవాదిలానో కనపడ్డానో ఏమో...... లోపు మా మ్యనేజర్ వచ్చి రక్షించాడు. అలా కథకి శుభం కార్డ్ పడింది.

అలా అలా ఐదున్నర అయ్యింది. ఐనా మా మిత్ర బృందం మాకెంటి అన్నట్టు ఏమీ పట్టకుండా ఉన్నారు.నాకైతే మరీ అన్యాయంగా అనిపించింది. నా కోసం ఒక్కరోజైనా బాధపడచ్చుగా. కనీసం నటించొచ్చుగా. నేను అలా గింజుకు చచ్చిపోతుంటే, పాపం మా వాళ్ళు సర్ ప్రైస్ ఇవ్వాలని అలా అలా జీవించి, సాయంత్రం నాకు ఎప్పుడూ గుర్తు ఉండిపోయేంత బాగా పార్టీ ఇచ్చారు. నెమ్మదిగా నాకు తెల్సిన వాళ్ళు అంతా వచ్చి విష్ చేసి, నువ్వు లా ,నువ్వు ఇలా అంటూ ఎత్టేస్తుంటే (వాళ్ళు మొహమాటనికే అని ఉండచ్చు), పర్లేదు వీళ్ళకి నేనంటే కాస్త గౌరవమర్యాదలు,ప్రేమాభినాలు ఉన్నాయి అని అనుకోవాలనిపించి అనేసుకున్నాను.

ఇంకా మా టీమ్ గురించి చెప్పాలంటే, మైక్ర్‌సాఫ్‌ట్‌లో పని ఉన్న లేకపోయినా, మా వాళ్ళకి మాత్రం నిరంతరం పని ఉంటుంది.పాపం రోజు కూడా పనిలో పడి కొట్టుకుంటూ, శ్రీవిద్యా ఇన్నాళ్లు భరించావు, ఇంకొక్క రోజు కాసేపు వెయిట్ చెయ్యి అనేసారికి ఆగాను. గంట కి వాళ్ళు పని ముగించి, నా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.ఎవరికి తోచిన పదాలతో వాళ్ళు నన్ను పొగిడేసాక ,అందరం క్లోజ్ అప్ నవ్వూలేసుకుని, ఒక గ్రూప్ ఫోటో దిగేసాము. నాకు తెలుసు, నేను ఎంత వెక్కిరించినా ఈ టీమ్, ఈ ప్రాజెక్ట్ నా ఎదుగుదలకి చాలా కారణమని. నేను చాలా మిస్ అవుతానని.

ఇంకా బయటికి వచ్చేస్తూ నా గుర్తింపు కార్డ్, నా డెస్క్ తాళాలు, సిస్టం అన్ని హండోవర్ చేసేసా. అంటే ఇంక నేను మాజీ ఉద్యోగిని ఐపోయానన్న మాట. కొంతమంది స్నేహితులు, కాసింత లోక జ్ఞానం, మరికొంత జావా పరిజ్ఞానం, ఇంకొంత నా పై నమ్మకం....... పర్లేదు నా మొదటి కంపనీ నాకు మంచి అనుభూతుల్నే మిగిల్చింది.

5 comments:

రానారె said...

సరదాగా బాగా రాశారు. కొత్త ఉద్యోగంలో తొలిరోజులగురించి కూడా రాయండి. :)

Anonymous said...

bavundhi madam....
evaru padithe vallu photolu thesthe ilage vuntundhi...konchem talent vundali nalaga....

Srividya said...

తప్పకుండా రాస్తాను :)

S said...

బాగా రాసారు అని మళ్ళీ అనను... గత నాలుగైదు పోస్టులుగా అదే కదా చెప్పేది నేను... ఇప్పటిదాకా నేను చేసిన ఏకైక ఉద్యోగం లోని ఆఖరురోజు గుర్తుచేసారు...కొంపదీసి అదే కంపెనీనో ఏమిటో! ;)

Sudhakar said...

okkasari gathamloki tisukellaru...

naaku annitikante ekkuvaga ID card tisukuntunte badhaga anipistundi.

mee writeup bagundi.