చక్రవాకం సీరియల్ని, హిందీలో సాస్ భీ కభి తి టైప్‌లో ఇంకా ఇంకా పది పదిహేను ఈయర్స్ సాగదీయకుండా మన మీద దయ తలిచారు. వాళ్ళు తీశారు సరే, నేనెందుకు చూడాలి అని ఎవరైనా అడగొచ్చు. ఇంట్లో టీవీ సీరియల్స్ తప్పితే వేరేవి చూసే ఆప్షన్ లేనప్పుడు మంచి సీరియల్స్ రావాలని సహజంగానే దేవుణ్ణి పార్ధిస్తాము. టీవీ ఎందుకు చూడాలి అంటే, వేరే పని ఎందుకు చెయ్యకూడదు అని కూడా సందేహం రావచ్చు.వేరే ఈ పని చేసినా(ఉదాహరణకి బుక్ చదవడం) పొరపాటున మనకు ఉపయోపడిపొవచ్చు. అదే ఈ ఈడియట్ బాక్స్ చూస్తే పెద్ద బ్రెయిన్ యూజ్ చెయ్యక్కర్లేదు ప్లస్ మనం బాగుపడిపోతాము అనే టెన్షన్ అక్కర్లేదు.అసలే ఆఫీసులో పని ఉన్న, లేకపోయినా నెట్ సర్ఫ్ చేసి తెగ అలసిపోయి వస్తాము.ఈ సోదంతా ఎందుకు గాని చక్రవాకం గురించి మాట్లాడితే......................
ఎప్పుడో నేను ఇంజినీరింగ్‌లో ఉంది, సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తే చాలు, డైరెక్ట్‌గా స్వర్గంలో లాండ్ ఐపోతాము అనుకునే రోజుల్లో మొదలు అయ్యింది. నేను జాబులో జాయిన్ అయ్యీ, ఈ ఇండస్ట్రీ గురించి నిజాలు బాగా భోధపడి ఇంక చాలు అనే స్థితికి వచ్చేశాను,ఐనా ఆ సీరియల్ తల, తోక లేకుండా సాగిపోతుంది ఏంట్రా అని చాలా మథన పడ్డాను. మొత్తానికి ఆ సీరియల్ ప్రేక్షకులకి ముక్తి లబించింది. ఈ శుభ సమయంలో అందరు గమినిన్చాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
బావుందని ఏ సీరియల్ని ఇన ఇంతలా ఆదరిస్తే సవత్సరాల పాటు ఇలా చూడాల్సి వస్తుంది. సీరియల్ని సాగడీయడానికి వాళ్ళు నానా ఏడుపుగొట్టు సీన్స్లొ జీవించేస్తుంటే అయ్యో సమీరా, పాపం వెన్నెల అంటూ పని పాటా లేనట్టు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం మానేసి మరీ నిజంగా ఏదో ఘోరం జరిగినట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది(పాపులర్ సీరియల్ కదా మరి).ఇలా చేసి, చేసి సీరియల్‌లో ఎక్ట్ చేసే వాళ్ళు బాగా డబ్బు వెనకేసుకుంటుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గొన్గళి అక్కడే అంటూ బ్రతికేస్తాము. వాళ్ళు అనురాగాలు,అనుబంధాలు అంటూ పాటలు పాడేస్తుంటే మన బంధాలు ఎలా ఉన్నాపట్టకుండా చూసేస్తూ ఉంటాము. ఎందుకంటే చెయ్యడం కష్టం. చూడటం సులువు.ఐన ఎవరు ఎంత మొత్తుకున్న మనం చూస్తాము.ఎందుకంటే టీవీ వాళ్ళు బ్రతకాలాయె . మన బలహీనతే వాళ్ళ బలం.
3 comments:
కొన్ని కోట్లమంది టీవీ ముఖ్యంగా చక్రవాకం సీరియల్ బాధితుల తరపున మీకు నా అభినందనలు,మరియు శుభాకాంక్షలు.శ్రీవిద్యగారు నాకు ఈ దిక్కుమాలిన చక్రవాకం
గొప్ప మేలు కూడా చేసింది,వెయ్యి ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేబుల్ కనెక్షన్ తీసెయ్యగలిగానంటే ఆ పుణ్యం ఎవరిదంటారు?మీరు తరచూ ఇలాంటి సామజిక ప్రయోజనం కలిగిన టపాలు రాస్తుండాలని నా అభిలాష.
Hi Rajendra Thanks for reading my blog.నేను మీ అంత బోల్డ్ డెసిషన్ తీసుకోలేకపోయాను కానీ ఇంకా ఏ సీరియల్ రోజూ చూడకూడదు కానీ నిర్ణయించుకున్నాను.చూస్తే గడిపోయిన కాలాన్ని సీరియల్ ఎపిసోడ్స్ సంఖ్యతో కొలవాల్సి వస్తుందని బాగా అర్థమైంది.
చక్రవాకం సీరియల్ అయిపోయిందనే ఒక శుభవార్త మీ బ్లాగు చదవడం వల్ల నాకు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
Post a Comment