Thursday, March 6, 2008

దుఃఖసాగరం విజయ సభ

దుఃఖసాగరం సీరియల్ నెల ముప్పయ్యేడో తారీఖున ఏడు వేల, ఏడు వందల, డెబ్బయి ఏడు భాగాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సీరియల్ నిర్మాత విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఇక సీరియల్ కథ విషయానికొస్తే పెద్దగా కథ ఏమీ లేదు. కానీ కథనె నిర్మాత మాటల్లో చెప్పాలంటే ఇది ఒక సున్నితమైన వృత్తాకార(వృత్తానికి అంతం,ఆది అంతుపట్టవు) ప్రేమ కథ. రాము,సోము, గీత,సీత నలుగురు కాలేజ్ స్టూడెంట్స్. రాము గీతాని ప్రేమిస్తాడు, గీత సోముని ప్రేమిస్తుంది.సోము సీతని ప్రేమిస్తాడు. సీత రాముని ప్రేమిస్తుంది. వీళ్ళలో ఎవ్వరి ప్రేమలు సఫలం అయ్యాయి? ఎవ్వరివి విఫలం అయ్యాయి? విఫలం ఐన వాళ్ళు, సఫలం ఐన వాళ్ళ మీద పగ తీర్చుకుంటారా? లేక సఫలం ఐన వాళ్ళు, విఫలం ఐన వాళ్ళ మీద పగ తీర్చుకుంటారా? అనేదే కథ.

దర్శకుడుని విజయ రహస్యం అడగ్గా, అస్సలు కథేంటో, ఎవ్వరు ఎవ్వరిని ఇస్టపడుతున్నరో అర్థం కావడానికే ప్రేక్షకులకి వెయ్యి భాగాలు పట్టిందని, దానికి తోడు కథలోని పాత్రలను కలిసిపొయే దాకా తెచ్చి, చివరి నిముషంలో అనూహ్యమైన మలుపులు తిప్పి విడగొట్టటం, ఒకవేళ కల్సిపొతే ఆది కల అని చెప్పటం, కల అనుకున్నదాన్ని నిజం అని చూపించటంలాంటి ఉత్ఖన్టభరితమైన సన్నివేశాలతో చిత్రీకరించడం వలన మరింత ప్రేక్షకాదరణ పొందిందని తెలిపారు.

అసలు ప్రేమకథేన్టి, సీరియలెంటి, దానికి దుఃఖసాగరం అని పేరేంటీ అని అందరూ తమని వెక్కిరించారని, కానీ అలాంటి కథతో కూడా ప్రేక్షకుల కన్నీటి గ్రంధులు ఇంకిపోయేవరకు కన్నీరు పెట్టించవచ్చని తాము సీరియల్ ద్వారా నిరూపించామని అని ఆనందంగా చెప్పారు.

నటీనటులు మాట్లాడుతూ, సీరియల్ తమకి చాలా సంతృప్తి ఇచ్చిందని, కొన్నేళ్ళుగా నటిస్తూనే ఉండటం వలన ఆర్ధికంగా బాగా స్థిరపడ్దమని అందుకు వీక్షకులకి సదా రుణపడి ఉంటామని తెలిపారు. ఇక సీరియల్‌లో మంచివాడో, చెడ్డవాడో అర్టం కాకుండా ఉండే మార్పు మంగా రావుగారు విభిన్నమైన పాత్రలో మన్చివాడి నుండి చెడ్డవాడిగా, చెడ్డవాడి నుండి మన్చివాడిగా ఊరికే మారిపోతూ, అప్పుడప్పుడు వైవిధ్యం కోసం పిచ్చివాడిగా నటించడం వలన నటుడిగా తాను చాలా పరిణితి సాధించగలిగానని అని సంబరంగా చెప్పారు.

ఇంక కొసమెరుపుగా నిర్మాత, సీరియల్ మిస్ కాకుండా చూసి, తాము అడిగే (హీరోకి ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు/పెళ్ళిళ్ళు జరిగాయి,అస్సలు హీరో చస్తాడా లేదా, ఛస్తే తిరిగి వస్తాడా లేదా, హీరోయిన్ నవ్వుతుందా లేదా, నవ్వితే ఆది కలా, నిజమా, అస్సలు సీరియల్ అవుతుందా లేదా?) ప్రశ్నలకి సరియైన సమాధానాలు చెప్పిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని చెప్పారు. అవేంటని అడగ్గా, అవెంటో చెప్పనంత వరకే ఆకర్షణీయంగా ఉంటాయని (బహుశా చిప్పలు, డిప్పలు అయ్యివుంటాయి) సెలవిచ్చారు.

6 comments:

Anonymous said...

Hehehe...... :))
bagundhe...

Anonymous said...

chala chala bavundi

రాఘవ said...

భలే వుందండి... చక్కగా వ్రాసారు

Srividya said...

చాలా చాలా ధన్యావాధాలు :)

Anonymous said...

ma friend okadu chadhivi nijam ga dhukka sagaram serial vundhi ,adhantha jarigindhi nuvvu just funny ga narrate chesavu anukuntunnadu...
vallaki chala baga nachhindhi....
inka "nenu evaro thelsa" post kuda baga nachhindhi...andhriki...

S said...

:)) keep writing!