Thursday, February 21, 2008

ఎవడి గోల వాడిది (అసలే రేటింగుల కాలం)

అన్నారావు, చిన్నారావు, కన్నారావు మంచి ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళు ముగ్గురు ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు.

అన్నారావు గోల:
బెంచ్ మీద ఉన్నాడు.ఒక సిస్టమ్ ఇచ్చేసి పండగ చేసుకో ఆన్నారు.మొదట కొత్త టెక్నాలజీస్ పనికి వచ్చేవి, పనికి రానివి అన్ని నేర్చేసుకోన్నట్టు వివిధ రకాల స్కిల్స్ ఇంప్రూవ్ చేసేసుకోన్నట్టు,అతి తక్కువ కాలంలోనే సీ.ఈ.ఓ అయిపోయినట్టు గాలిలో పెద్ద పెద్ద మేడలు కట్టిన కొద్ది కాలంలోనే నేర్చుకునేది తక్కువ, నిద్రపోయేది ఎక్కువ అవ్వడంతో మేడలు కాస్తా డామ్మని కూలిపోయాయి.ఇంక అప్పటి నుంచి ఎంత ఎఫ్ఫెక్టీవ్‌గా టైమ్ వేస్ట్ చెయ్యచ్చు అనే విషయం మీద పరిశోధన మొదలుపెట్టాడు.

బాగా లోతైన పరిశోధన చేసిన తర్వాత ఒక ఖచ్చితమైన
టైమ్ టేబుల్ రెడీ చేసుకున్నాడు.పదకొండుకి రావటం, మెయిల్స్ చూసుకోవటం ,కాస్త బావుంది అనిపించగానే తెల్సిన వాళ్ళు, తెల్సిన వాళ్ళకి ఫార్వార్డ్ చెయ్యడం, వెళ్ళి న్యూస్ పేపర్స్ పై నుంచి కింద దాకా చదివేసీసీ, లంచ్ చేసేసి, చాటింగ్, బ్రౌజింగ్, ఆర్కుటింగ్ చేతులు నొప్పెట్టేవరకు చేసేసి , సాయంత్రం మళ్ళీ టీ తాగి, సుత్తి కొట్టడానికి ఎవరైనా దొరికితే వాడి బుర్ర తినేసిఆరుకల్లా ఇంటికి వచ్చేయడమ్. మధ్యలో ఎన్ని ట్రైనింగ్స్ ఉంటే అన్నిటికి వెళ్ళి నిద్రాపోవడం. ఇంక బోర్ కొట్టేసింది,ప్రాజెక్ట్ కోసం ట్రై చెయ్యాలి అని చిన్న ఆలోచన వచ్చేసరికి రేటింగ్స్ ఇచ్చే టైమ్ వచ్చేసింది. రిపోర్టింగ్ మేనేజర్ ఐదుకి రెండున్నర వేశాడు.ఆది చూడగానే అన్ణారావుకి పూనాకం వచ్చేసి ఊగిపోతూ ఎందుకు తక్కువ ఇచ్చావు అని అడిగాడు.

నువ్వు
మూడు నెలల్లో చేసిన పనికొచ్చే పనేమీ లేదు.ప్రాజెక్ట్ మీరు ఇవ్వలేదు, దానికి నేను ఏమీ చెయ్యను అన్నాడు.మేము ఇవ్వకపోతే నువ్వు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యలేదు.పోనీ ఆది వదిలెయ్.ఒక్క క్షణమైనా అయ్యో నేను ఊరికే జీతంతీసుకుంటున్నాను.కంపనీకి ఎలా ఉపయోగపడగలను అని ఆలోచించావా...? అని అనేసి నీకిది ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు ఒక చూపు చూసేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కంపనీ నుంచి గెన్టెస్తాడేమొ, అసలే బెంచ్ అని పాపం అన్నారావు కిమ్మనకుండా కూర్చున్నాడు. ఐనా ఉపయోగపడటం అంటే ఏమిటి అందరి కన్నా ముందే వచ్చేసి ఆఫీస్ అంత శుభ్రం చేసేసి, బాత్ రూమ్స్ క్లీన్ చేసేసి, ఎంట్రన్స్ దగ్గర ద్వారపాలకూడిలా నిలబడాలా.....?
ప్చ్..........
అన్నారావుకి అంతా అయోమయంగా ఉంది.

ఇంకా ఉంది.
చిన్నారావు గోల వచ్చే సంచికలో..................................

1 comment:

S said...

ఏది చిన్నారావు గోలా?? ఎక్కడ ఎక్కడ?