Sunday, February 17, 2008

కలలు కంటూ.........................!


మనసు తెలిపే కథలు వింటూ
నన్ను నేనే మరిచిపోతూ
కలలు కంటూ
నేడు నిన్నై కరిగిపోతే
నేటి క్షణాలన్నీ జ్ఞాపకాలై జారిపోతే
రేపు నేడై కనుల ముందు నిలిస్తే
అందమైన ఆశలన్నీ
నిజం చేయాలని ఎదురు చూస్తుంటే
నేను మాత్రం
మనసు తెలిపే కథలు వింటూ
నన్ను నేనే మరిచిపోతూ
కలలు కంటూ.........................!

No comments: