మొన్న Sunday, ఆస్ట్రేలియాని మన వాళ్ళు ఓడించగానే కత్తి, బాకు అంటూ పొగిడేశారు. పాపం ఆ దెబ్బకి మన వాళ్ళకి దిష్టి తగిలిఈరోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయారు. పొగడటం అంటే మామూలుగా కాదుగా.భావి భారత ఆశ కిరణం, ప్రపంచాన్ని శాసించే ఉత్తమ ఆటగాడు అంటూ ఒకటే ఊదరగొట్టుడు. ఇక పని పాటా లేని వాళ్ళంతా టీవీలో కలిసి భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక అపురూపమైన ఘట్టం. అమూల్యమైన విజయం అంటూ సొది కబుర్లు. ఈ మ్యాచ్ గెలిచినా ఇదే గోలా... ఇంకా రిప్లెలు మీద రిప్లెలు వేసి మధ్యలో ప్లేయర్స్ Lip movement ఇచ్చినా నవ్వినా, ఏడ్చినా ఆ Experessions Translation.
Srisaanth ఇలా అనుకుని ఉంటాడు కాబట్టి అలా నో బాల్ వేసి ఉంటాడు . Sachin ఇలా అనుకుని ఉంటాడు కాబట్టి అలా బ్యాట్ ఊపి ఉంటాడు అని చావాగోడుతూ ఉంటారు. ఆ విషయాలన్ని వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టు. ఎలాను పిచ్చి ప్రేక్షకులు(అంటే మనం) అలా అన్నారో లేదో ప్లేయర్స్ ని అడిగి confirm చేసుకోలేరు.జనాలు వినాలి అనుకునేవీ అన్ని( ప్లేయర్స్ అనుకుని ఉంటారు అంటూ) వాళ్ళు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తునే ఉంటారు. నిజమే కాబోలు అనుకుంటూ మనం అదేదో భారతంలా మళ్లీ మళ్లీ వింటూనే ఉంటాం. మరి ఓడిపోతే సీన్ రివర్స్.మనకి మళ్లీ ఇంకో మ్యాచ్ గెలిచే వరకు క్రికెట్ అంటే టెంపరరీ అయిష్టం.
No comments:
Post a Comment