Wednesday, February 13, 2008

అనసూయ


అనసూయకి ముందు ఇంటి పేరు లేదు. వెనక ముద్దు పేరు లేదు. మంచి స్టోరీ లైన్ మాత్రం ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టమైతే చూడొచ్చు.భయమైతే నేను ఏమీ చెయ్యలేను.భూమిక బావుంది ప్లస్ బాగా చేసింది.పాపం అబ్బాస్ కి అంత సీన్ లేదు.ఏదో హీరోయిన్‌కి హీరొ ఉండాలి కదా అనే మానవత దృక్పథంతో పెట్టారు.చిన్న పాప బాధ్యత భూమిక తీసుకోవడం, రిపోర్టర్ల ఆడ్వెంచర్స్ చెయ్యడం అంతా చూస్తే "Sidney Sheldon Best Laid Plans" "DanaEvans" character గుర్తోచ్చింది. ఇనిస్పిరేషన్ ఎక్కడ నుంచి తీసుకుంటే ఏంటి, మంచి పాయింట్ తీసుకున్నారు. మన బుర్ర తినకుండా, సినిమాకి శుభం కార్డ్ వేసేసారు.ఆది చాలు మన జీవితాలకి.మొత్తానికి సినిమా బానే ఉంది.

1 comment:

రానారె said...

'..మానవతా దృక్పథంతో..' - ఫక్కున నవ్వించారీమాటతో. :)