రేపు నాకు ప్రస్తుతం పని చేస్తున్న కంపనీ లో లాస్ట్ రోజు. ఆ సందర్భంగా మా కంపనీ(ఇంకా మా ఏంటి, అలవాటులో పొరపాటు) , ప్రాజెక్ట్, మా టీమ్ జనాల మీద ఒక పోస్ట్ రాయాలి అని అనిపించింది.సరిగ్గా మూడు నెలల క్రితం ఇదే పోస్ట్ రాస్తే మొత్తం మ్యాటరే వేరుగా ఉండేది.
గాడిదను చేసి పని చేయించుకుంటున్నారు.అవార్డులు, రివార్డులు మాట పక్కన పెడితే, రెండేళ్ళ నుంచి జీతం పెంచమంటే ప్రమోషన్ ఇచ్చేసి చేతులు దులిపెసుకునే మా మానవవనరుల శాఖ వారు(అవును మరి అదొక్కటే ఖర్చు లేని పని. పై పెచ్చు నువ్వు సీనియర్ అని ఇంకాస్త పని చేయించుకోవచ్చు).ఇంకా ఎక్కువ మాట్లాడితే, నీకు నాయకత్వ లక్షణాలు లేవు.సమస్యలు ఉంటే నాకొచ్చి చెప్పవు( చెప్పిన వాటికేవో పరిష్కారాలు చూపించినట్టు), నువ్వు మాట్లాడేటప్పుడు చాలా చిన్నగా మాట్లాడుతావు. ఆఫీసుకి లేట్ గా వస్తావు(అక్కడ నుంచి రావడం ఎలాను నా చేతిలో లేదు). పనిస్తే నీకు నచ్చినట్టు చేస్తావు( నచ్చినట్టు కాదు మహాశయా, నాకు వచ్చినట్టు) అంటూ గంటలు గంటలు మా మ్యానెజర్ ఉపన్యాసాలూ. ఇంకా అవకాశం దొరికితే మొత్తం పని నా మీద రుద్దేసే మా టీమ్ జనాలు.ఆపని, ఈ పని అంటూ లేటుగా ఉంచేసే మా . బాగా పని చేస్తున్నావు అని తెగ పొగిడి, ఇంకాస్త పని నెత్తి మీద పెట్టేసే మా అమెరికా అన్నయ్యలు. అలా చాన్తాడన్త పొడుగు సినిమా కష్టాలు రాసేదాన్ని.
కానీ ఈ రోజు నాకే వింతగా అనిపిస్తుంది. ఈ కంపనీలో ఇన్నాళ్లు ఉండటం వలన నాకేదో అన్యాయం జరిగిపోయిందనే నాకు ఇంత అనుబంధం ఉందా అనిపిస్తుంది.రెండు లైనుల పోగ్రామ్ కూడా రాయలేని నాకు , ఎనిమిది కంపనీలూ చీ పొమ్మన్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన రోజు....., కంప్యూటర్ కీ బోర్డుని తాకినంతనే, ఏమీ ఐపోతుందో అని చేతులు వణికే రోజులు......, పని ఎక్కువై ఫ్రస్టేషన్‌తో తల పట్టుకున్న రోజులు...., అనుకున్నది అనుకున్నట్టు పని చేసినప్పుడు ఐన్స్టీనులా ఫీల్ ఐన రోజులు..., ప్రాజెక్ట్ సక్సెస్ ఐతే టీమ్ పార్టీలు, డామ్మన్టే అమెరికా అన్నయ్యల అక్షింతలు బాగా గుర్తు వచ్చి నవ్వు వస్తుంది.
మా అమెరికా అన్నయ్య ఏమన్నంత వరకు ఎనిమిది గంటలు పని చెయ్యాల్సిన రోజుల్లో, నాలుగు గంటలె పని చేస్తే ఊరుకున్న మా మ్యానేజర్, ఒక కంటితో పని చేస్తూ, ఇంకో కంటితో పది, పదిహైను నవలలు చదివిస్తే చూసీ చూడనట్టు ఉన్న మా లీడ్. వాళ్ళు మాత్రం రాత్రి పదకొండు వరకు ఉంటుంటే, ఆరింతికే ఇంటికి చెక్కేసే నన్ను చూసి తేలిక్కా నవ్వేసే మా టీమ్ జనాలు వీళ్ళు నా కన్నా మంచివాళ్ళే అనిపిస్తుంది..మధ్యాహ్నం భోజనం చేస్తూ, ఇంకా కాలేజీలోనే వున్నామేమొ అనిపించేలా అల్లరి చేసె మా కోతి మూక. నాఫ్రెండ్స్ , ఆ క్యూబికల్, నా కంప్యూటర్,నేను రాసిన చెత్త కోడ్, నా కుర్చీ, నా డెస్క్, నా గుర్తింపు కార్డు అన్ని చాలా అపురూపంగా అనిపిస్తున్నాయి. కానీ రేపటి నుంచి నా స్కూలు, నా కాలెజీలానే నా మొదటి కంపనీ కూడా జ్ఞాపకంగా మారిపోతుంది.
ఐనా మనుష్యులు అంటే మనం ఇంత సెంటిమెంటల్ ఫూల్స్ ఎందుకో...........?ఇదంతా రాస్తున్తే నాకు ఈ సాఫ్ట్ వేర్లో పదేళ్ళ అనుభవం ఉన్న ఒక సీనియర్ వున్నమాటలు గుర్తు వచ్చాయి.నువ్వు చేసే పనిని ప్రేమించు, కంపనీను కాదు అని చెప్పాడు ఒకసారి. నాకు చాలా సార్లు చాలా నిజం అనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం ఆది నిజం అని ఒప్పుకోబుద్ది కావటం లేదు. ఏమోలే కొత్త కంపనీకి వెళ్ళిన నాలుగు రోజులకీ ఈ అభిప్రాయం మారిపోవచ్చు.
7 comments:
కంప్యూటరు,డెస్క్,కుర్చీ అంటూ కూడా కళ్ళు తడిచేలా చేసారు.ఏదేమయినా ఏదయినా మనకి దూరం అయ్యేవరకూ దాని విలువ,దానిలోని ఆనందం,మంచితనం తెలియవు.దూరమయ్యాకా అందులో అంత మంచి లేకపోయినా,నిజానికి మనం పొందిన ఆనందం పెద్దగా లేకపోయినా చాలా అపురూపం గా అనిపిస్తూవుంటుంది.కొత్త ఉద్యోగానికి ఆల్ ద బెస్ట్.
Read telugu blogs from your cell phones. Click for more details blogkut
::Please remove word verification for commenting::
మీరు పైకి చెఫ్ఫేరు. కొంత మంది లోలోపలే కుమిలిపోతారు. అన్ని ఉద్యోగాల్లోనూ వుండే సమస్యలే ఇవి. వదిలేసేరుగదా, ఇదొక మజిలీ అనుకోవడమే. కొత్త స్థానం నూతన తేజాన్ని ఇవ్వాలని ఆశిస్తాను.
మీరన్న ఆ చివరి ముక్కలు చాలా కరక్టు.మనం పనిని ప్రేమిస్తే ఆ పనికే మారు పేరు మనమవుతాం. అందరూ మనం ఆడించినట్లాడాల్సిందే...
@రాధిక: నేను ఏమీ అనుకుంటున్నానో తెల్సింది కానీ. ఎందుకలా అనిపించిందో అర్థం కాలేదు.ఆ విషయం మీరు బాగా చెప్పారు.
@చిన్నమయ్య&సుధాకర్ గారు: మీ విషెస్ కి, సలహాకి, మరియు నా బ్లాగు చదివినందుకు నా కృతజ్ఞతలు.
Hmm.... మీరు మళ్ళీ నాకు గతం గుర్తుచేసేస్తున్నారు...నన్ను మామూలుగానే వద్దంటే జ్ఞాపకాలు తరుముతూ ఉంటాయి.. మీ పోస్టు చదవగానే... వెంటపడి మరీ తరుముతున్నాయి.... Yes... I can identify with your writeup to a large extent.... వీడుకోలే...దేనికైనా వీడుకోలే...చెప్పాల్సిందే ఆఖరుకి!
Hey this article is similar to my feelings,by the way did u work for INFosys(I got this doubt by seeing your lastlines,Love your not the Company).
Nice Blog
Post a Comment