Tuesday, February 19, 2008

నేను ఎవరో తెలుసా.....?

ఒక రోజు పెళ్ళిళ్ల పేరయ్య గారు తాను ఆఫీసులో కూర్చుని ఎవరితో ఎవరికి ఎన్ని అబద్దాలు ఆడి ముడి పెడితే ఎంత కమిషన్ వస్తుందా అని దీర్ఘంగా లెక్కలు వేసుకుంటున్నాడు.అప్పుడే ఆయన గదిలోకి ఒక అబ్బాయి వచ్చాడు.అమ్మాయిని వెతుక్కోవడానికి అని ఆయనకి అర్థం అయిపోయింది.ఇక రిక్వైరుమెంట్ గ్యాదర్ చెయ్యడం, ఎవరో ఒక అమ్మాయికి కట్టబెట్టేయ్యడం ఆయన ముందున్న లక్ష్యాలు ప్రస్తుతానికి. కూర్చో బాబు. నీకేలాంటి అమ్మాయి కావాలో చెప్పు అన్నాడు.అంతే మన హీరో గారు మొదలుపెట్టారు.

అమ్మాయి బాగా చదువుకోవాలి.మంచి ఉద్యోగం చెయ్యాలి.అలా అని సంపాదిస్తున్నాను అనే గర్వం మాత్రం ఉండకూడదు.చక్కగా వంట చెయ్యగలగాలి.మా ఇంట్లో అందర్నీ ప్రేమగా చూసుకోవాలి.మేము తనని ఎలా చూసినా భాధ పడకుండా మాతో కలసిపోవాలి.బోలెడంత ఓపిక ఉండాలి.అభిప్రాయాలు ఉన్నతంగా ఉండాలి.పాతకాలం ఆలోచనలు ఉండకూడదు.కానీ చూడటానికి మాత్రం చాలా సంప్రదాయంగా, చూడగానే చేతులెత్తి దణ్ణము పెట్టేలా ఉండాలి.చూడటానికి చక్కగా, అందంగా ఉండాలి. మంచి కుటుంబం నుంచి రావాలి.పలుకుబడి ఉన్న కుటుంబం ఐతే మరీ మంచిది.ఇక కట్నం విషయం, ఆ విషయంలో పెద్ద పట్తింపులు లేవు.కానీ ఇస్తామంటే ఎందుకు వద్దు అంటాము చెప్పండి.కాబట్టి పైన చెప్పినవన్ని కుదిరితేవాళ్ళలో మళ్లీ కట్నం ఇచ్చే వాళ్ళకి ప్రిఫరెన్సు ఇద్దాము.ఇంతేనండి ఇంతకి మించి నాకేమీ కోరికలు లేవండి అంటూ ముగించాడు.

పెళ్ళిళ్ల పేరయ్య గారు అంతా సావధానంగా విని, సదరు పెళ్లి కొడుకుని ఒకసారి ఎగాదిగా చూసి మాట్లాడటం మొదలు పెట్టాడుఅసలు నాకో సందేహం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి నిన్ను ఎందుకు చేసుకోవాలి అసలు అని అడిగాడు.వెంటనే ఆ అబ్బాయి మొహం కోపంగా పెట్టి, ఏమీ మాట్లాడుతున్నారు మీరు? నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు.తాను పోయి పోయి ఏ మంత్రి గారి చుట్టంతోనో, పేరు మోసిన గుండాతోనో పెట్టుకున్నాడేమో అని......... పీళ్ళిళ్ల పేరయ్యకి దడ పుట్టింది.పేరయ్య కాస్త భయపడ్డాక, కాస్త స్తిమితపడి అడిగాడు.ఎవరు బాబూ నువ్వు అని అడిగాడు.
నేనా..... నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ని అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ.

2 comments:

Anonymous said...

chaala baavundi :-)

Okappudu ammayilo, konchem andam + konchem chaduvu + konchem aasti + manchi family ila choosevaru ...ippudemo chala andam + chala cahaduvu + chala aasti + chala palukubadi..sameekarana maaripoyindi

కొత్త పాళీ said...

అవునుట .. ఈ మధ్యేప్పుడో మా స్నేహితుడు రాసిన ఓ కథలో హీరోయిన్‌తో ఆమె స్నేహితురాలు అంటుంది .. మా అన్నయ్య మీద ఆశాలు పెట్టుకోకు, అతనికి సాఫ్టు వేరు ఉద్యోగం చేస్తూ గోంగూర పచ్చడి చేసి పెట్టే ఐశ్వర్యా రాయి కావాలి. అని.

http://eemaata.com/em/issues/200307/447.html

మీకు పుణ్యువుంటుంది, ఆ వర్ద్ వెరిఫికేషను తీసెయ్యండి.