Friday, May 7, 2021

కరోనా కల్లోలం

 ఎటు చూసినా ఒక రకమైన భయం, నిరాశ, నిస్పృహలు. ఏ నిముషంలో ఎం జరుగుతుందో, ఏ క్షణాన ఎం వింటామో అన్న భయంతో వణికిపోతున్నాము. ఈ మాయదారి కరోనా మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. ఆశల్ని ఆవిరి చేస్తుంది. చాలా భయంకరమైన రోజులు ఇవి. ఎప్పుడు లేదింత నైరాశ్యం .  

దగ్గరగా చావు చూసినపుడు, ఒక్కసారి నిద్ర లేస్తాము. మనకూ అలా అవ్వచ్చనే ఊహ చాల భయానకంగా అనిపిస్తుంది.  ఇదే శస్మాన వైరాగ్యం. చాలా మంది పోతున్నప్పుడు మనమూ పోతామని లేదు. అందరూ బాగున్నపుడు మనం బాగుంటామని లేదు. ఈ విషయం కరోనా కల్లోలం తగ్గాక  కూడా గుర్తు పెట్టుకుందాము.  మరణం అనేది అందరికీ తప్పదు. ఎవ్వరం ఇక్కడే ఉండిపోము.  అందుకే మంచి చేద్దాము.  కుదిరితే సాయం చేద్దాము. లేని పోనీ కక్ష్యలు కార్పణ్యాలు వద్దు.  ఊరికే మాటలు అనొద్దు. ఆవేశకావేశాలు అస్సలొద్దు. మన జీవితంలో ప్రతిరోజూ దేవుడిచ్చిన గిఫ్ట్. కృతజ్ఞతలు చెప్పుకుందాము. ప్రతినిముషం అర్ధవంతంగా గడుపుదాము. మన వాళ్లందరికీ అందమైన జ్ఞాపకాలు మిగిలుద్దాము. మన పిల్లలకి మంచి విలువలు ఇద్దాము. 

2 comments:

MURALI said...

మొత్తానికి బ్లాగు దుమ్ము దులిపి బయటకి తీసారు. అలానే వింటేజ్ శ్రీవిద్య కామెడీ కూడా బయటకి రావాలి. నవ్వులు కరువైపోయాయి. ఇప్పుడు నవ్వించటం కూడా అవసరం మరి.

Srividya said...

Thank you Murali. . బాధ్యతలు పెరిగిపోయాయి. రాయాలి, రాస్తాను :)