ఏమి అయిపోయాను ఇన్నాళ్లు? వున్నాను నా అంతర్ముఖంలో దాక్కున్నాను. ఏదో అంతర్మథనంలో మునిగి తేలాను. పారిపోయానా నేను? కాదు నన్ను నేను వెతుక్కుంటున్నాను. ఒక నిముషం దొరుకుతాను. మరు నిముషం అందకుండా జారిపోతాను. నాకు నేనే అర్ధం కాను. నాలోనే వంద పార్శ్వాలు. నాలోనే వేల గొంతులు.
నన్ను నేను చేరేందుకు నాలో నేను నాతో నేను ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం పూర్తవ్వలేదు కానీ గమ్యం కోసం ఆరాటం లేదు. నాతో నాకు పోరాటం లేదు. నా మీద నాకు నిర్లిప్తత లేదు. నా మీద నాకు అపనమ్మకం లేదు. నేనంటే నాకు అసహనం లేదు. ఇప్పుడిప్పుడే నాతో నాకు స్నేహం చిగుర్లు వేస్తోంది. నేను నాకు పరిచయం అవుతున్నాను. నేను నాకు అర్ధం అవుతున్నాము. వేరెవరూ తమ ప్రతిబింబాలన్నీ అద్దంలో చూపించి నమ్మేసేదాన్ని. ఇప్పుడు నేను నాకు తెల్సు. నేను ఏది కాదో కూడా తెల్సు. నావి ప్రతిబింబాలకి దూరంగా, నాతో నేను దగ్గరగా. ఇదేనేమో సంతోషం అంటే.
నాతో నాకు స్నేహం.
నేనే నాకు మోదం .
నాలో నాకు హర్షం .
No comments:
Post a Comment