Wednesday, May 21, 2008

అపరిచితురాలు

నా మొదటి కంపనీలో మా బ్యాచ్ జాయిన్ అయ్యిన వెంటనే మాకేమీ రాదని అర్థం అయిపోయింది ఆ కంపనీవాళ్ళకి. మా బుర్ర బూజు దులిపి, కాస్త గ్రీజు రాసి వాటిని పనికొచ్చేలా చేసే బాధ్యతని లత అనే సూపర్ ట్రైనర్ చేతుల్లో పెట్టారు. మా లత ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు అరుస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో మా బుల్లి మెదళ్ళకి అంతు పట్టక ముద్దుగా అపరిచితురాలు అని పిలుచుకునే వాళ్ళం.మా లతకి రోజుకి నాలుగు సార్లు కోపం వచ్చేది. ఎందుకు వచ్చేది అంటే ఏం చెప్తాము. అదంతే. కొన్నిటికి కారణాలు వుండవు.కోపమొస్తే "మీకేమి రాధు. మీరెందుకు పనికి రారు" అంటూ ఆపకుండా చెవులు చిల్లులు పడేలా బండ బూతులు తిట్టేది.

ఒక రోజు పని లేని మంగలోడు పిల్లి తల గొరికినట్టు, క్లాసులో ఓ తలకి మాసినోడు "లత నువ్వింకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు..?" అని అడిగి తగలడ్డాడు. లత ఒక్కక్షణం ఆగి గట్టిగా ఊపిరి తీసుకుంది. అర్థమయిపోయింది మాకారోజు మూఢిందని. మా ప్రాణాలు తోడేసే ప్రోగ్రామేదో ప్లాన్ చేసిందని. టైం మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. కథ (రొద) మొదలుపెట్టింది.

నేను ఎల్.కె.జిలో జాయిన్ అయ్యాను అంటూ ఎత్తుకుంది.డిటైల్స్ మరీ అంత చిన్నప్పట్నుంచీ వద్దని మేము మొత్తుకుంటున్నా, ఆవిడ ఏబీసీడీలు దిద్దుకుంటూ పదో తరగతి పాసయ్యేసరికి 2:00 అయ్యింది. కథ కాలేజీ గేటు దగ్గరకి వచ్చేసింది.కాలేజీ అంటే ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోలేదో చెప్తుంది అని నోరు తెరిచి, ఒళ్ళు మరిచి ఆత్రుతగా అందరం ఎదురు చూస్తున్నాము. కానీ మాకంత అదృష్టం ఎక్కడ ఏడిచింది.మా గుండెల్ని ముక్కలు చేస్తూ, అసలు పెళ్ళి ప్రసక్తే లేకుండా కాలేజీ కూడా అయిపోయింది. టైం 2:30. కడుపులో ఎలుకలు క్రికెట్ ఆడేసుకుంటున్నాయి. లతకి జాబ్ వచ్చింది. వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అయ్యింది. కజిన్స్ కీ పెళ్ళి అయ్యింది. కథ అవ్వటం లేదు. అందరూ నీరసంతో చచ్చేలా వున్నారు. తమ్ముడికి పిల్లలు పుట్టారు. వాళ్ళ కజిన్స్కీ పిల్లలు పుట్టారు. మళ్ళీ జాబ్ మారింది. కడుపులో ఆకలి మంటలు. ఇంక తెగించి "ఆపేయ్ తల్లోయ్ నీకో దణ్ణం" అని చేతులెత్తి మొక్కేసాం. దాంతో మా మీద దయ తలిచి చిద్విలాసంగా నవ్వుతూ 4:00 కి ఆ చిదంబర రహస్యం చెప్పి మాకు ముక్తి కలిగించింది. "నా జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగాయి. ఏ ఒక్క క్షణంలోనూ, సందర్భంలోనూ నాకు పెళ్ళి చేసుకోవాలి అనిపించలేదు. అందుకే చేసుకోలేదు.." అంది చాలా వీజీగా.

వార్నీ సమరసింహా రెడ్డి, సింహాద్రి లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ వుంటుందని ఊహించుకున్నాను. ఒక్క డవిలాగుతో గాలి తీసేసింది.ఈ ముక్కేదొ ముందే చెప్తే నాలుగు అన్నం మెతుకులు తిని ఈ పాటికి సీట్లో పడి హాయిగా నిద్రోయేవాళ్ళం కదా..
దీనికి తోడు ఈ సోది భారతం విని ఒకడు మరీ కదిలిపోయి, కరిగిపోయి,రెచ్చిపోయి, లత నువ్వు నిజంగా త్యాగ మూర్తివి.నేను నీ జీవిత చరిత్ర రాసేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నాడు. అంతే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా మా క్లాస్ రూం మొత్తం షాకయ్యి, షేకయిపోయింది. ఈవిడ చిన్న చిన్న పిట్ట కథలు వినే మా మెదడులో రక్తం గడ్డ కట్టేస్తుంది.మొత్తం జీవిత చరిత్ర అంతా రాసి, జనాల మీదకి వదిలితే ఇంకేమన్నా వుందా....? జరిగే నరమేధాన్ని ఊహించడం నా తరం కాలేదు. ఏదో ఆవేశంలో నోరు జారాడని వాడి చేత బలవంతంగా రాయించుకుంటుందేమోన్న టెన్షన్ తో వాడి దగ్గరకి వెళ్ళి కొంపదీసి నిజంగానే రాస్తావా ఏంటి అని అడిగాను. వాడి నాలుకని అటూ ఇటూ ఆడించి లేదు ఉత్తుత్తినే, నాకింకా కొన్నాళ్ళు బతకాలని వుంది అన్నాడు. హమ్మయ్య బతికించాడు.వాడికా మాత్రం క్లారిటీ వుంది అది చాలు.

14 comments:

రాధిక said...

iragadiisaaru kadaa.:)

కొత్త పాళీ said...

హమ్మో, మీరు హస్యంకూడా బాగా పండించారే ఇవ్వాళ్ళ కూడలిలో ప్రత్యేక హాస్య బుధవారంఓ ఏవిఓ, ఇంటికెళ్ళి పంచాంగం చూడాలి

క్రాంతి said...

అదుర్స్ అండి.మీ లత లాంటి లత నాకు దొరికి ఉంటేనా...ఈపాటికి నేను తన జీవిత చరిత్ర రాసేదాన్నే!

రానారె said...

:-))

ట్రైనింగ్ కామెడీలు భలే వుంటాయ్. ఇంకా రాయండి.

Bolloju Baba said...

the narration is so gripping

జ్యోతి said...

ఏంటొ అందరికి ఈ మధ్య సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువైంది. కానివ్వండీ. నవ్వడం కంటే నవ్వింఛడం చాలా గొప్పది.
విద్యగారు, ఒక్కసారి నాకుమెయిల్ చేయండి..ప్రమదావనంలో కలుద్దాం

http://jyothivalaboju.blogspot.com

ఓ బ్రమ్మీ said...

అయితే మీరు తప్పని సరిగా ’ఆడవాళ మాటలకు అర్దాలే వేరులే..’ అన్న సినిమా తప్పకుండా చూడవలసిందే. ఆ సినిమాలో హీరో పరిస్తితి ఇంచుమించు ఇలాంటిదే. కాకపోతే ఒక సీన్‍లో మన హీరో గారికి ఒక్క కొట్టరు మందు పడగానే మొత్తం ప్రాజెక్టు అంతా ఒక్క రాత్రిలో వచ్చేస్తుంది.

కాబట్టి తమరు కూడా మంచి రోజు చూసుకుని ఒక మందు బాటిల్ పెట్టేసుకోండి. అంతా వచ్చేస్తుంది. పనిలో పనిగా మీ లతగారికీ కోంచం పోసేయ్యండి, అంతే సంగతీ ఇంక ఠా అంటూ ఓ మూల పడి ఉంటుంది.

ఏమంటారు?

Anonymous said...

chala bagundi,ithaki pelli gurichi
kadipi varini meerantha yamchesao cheppa ledu.

S said...

:)) too good!

Anonymous said...

Nenu comment rayakkarledhu...
Paina bollu mandhi rasesaru.... :)

Srividya said...

అందరికి థాంక్స్ :)
@క్రాంతి: నిజంగా మా లత జీవిత చరిత్రకి మీరైతేనే న్యాయం చెయ్యగలరు.
@subhadra: మాకైతే కనీసం ఆవలించే అవకాశం అయినా దొరికింది. అడిగిన పాపానికి తల పక్కకి తిప్పే చాన్స్ కూడా ఇవ్వకుండా అతన్నే చూస్తే చెప్పింది.పాపం వీర బలి.
@కొత్త పాళీ : మీ చేత పండించారు అని అనిపించుకుంటే నిజంగా పండించినట్టే :).

KIRAN KUMAR said...

chala bagundi

MURALI said...

abbo kopa teesi meeru chebutunnadi Virtusa Latha gurinchi kadu kada. Ayina adbutham. http://muralidharnamala.wordpress.com/

praveena Reddy said...

hai srividya nee blog chala bagundi.Meeku inta talent vundaa??