Thursday, July 31, 2008

నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే........!

చదువు వచ్చి మన మీద పడినా మనం వెళ్ళి చదువు మీద పడినా మనకే నష్టం.
చదువు రాకపోవటం ఒక యోగం
చదువుకోనక్కర్లేకపోవటం ఒక భోగం
చదువుకోవాల్సిరావడం ఒక త్యాగం
*************************************************
చిన్నప్పుడు ఇలా పైత్యం కలిపిన కపిత్వాన్ని చెప్పేంత తెలుగు రాదాయే... అందుకే బడి అన్న మాట వినగానేకాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ, కింద పడి దొర్లేస్తూ చదువు మీద నా నిరసనని తీవ్రంగా తెలిపేదాన్ని. అయినా సరే ఏ మాత్రం జాలి లేకుండా మా నాన్న ఎత్తి ఏట్లో పడేసినట్టు ఎత్తుకుని మరీ బళ్ళో పడేసేవారు.అదీ కాకుండా, మా అన్నయ్యకి ఎప్పుడూ వంద జ్వరం వుండేది. అందుకే ఎవరైనా మీ అన్నయ్య స్కూలుకెందుకు వెళ్ళట్లేదని అడిగితే "మరేమో మా అన్నయ్యకి జ్వరం ఇంచక్కా" అని చెప్పేదాన్ని. మా అమ్మేమో "చీ తప్పు ఇంచక్కా అనకూడదు. మా అన్నయ్యకి జ్వరం పాపం అని చెప్పాలి" అని కోప్పడేది.

అప్పటికీ తెలివిగా పొద్దున్న లేవగానే "అమ్మోయ్.. అమ్మోయ్..! నాకు జ్వరం వచ్చేసింది. నేను స్కూలుకెళ్ళను" అనేదాన్ని. వెంటనే నాన్న వచ్చి "బాబోయ్.. బాబోయ్ జ్వరమా అమ్మలు" అని ధర్మామీటరు తీసుకొచ్చేసేవాళ్ళు. ఆ దొంగ ధర్మామీటర్ ఎప్పుడూ అన్నయ్య పార్టీనే..వాడికి పాపం (ఇంచక్కా) 100 జ్వరం చూపించేది. నాకు మాత్రం అస్సలు జ్వరమే లేదని చూపించేదాన్ని. జ్వరం వుందని చూపించవా.. చూపించవా అని బతిమాలినా సరే చూపించేది కాదు. అందుకే దాని మీద బోలెడు కోపం వచ్చేసి డామ్మని కింద పడేసాను. అప్పుడు నాన్న "అల్లరిపిల్లకానా..! నీకు గారం ఎక్కువయిపోయింది. అసలు చెప్పిన మాట వినట్లేదు. పద స్కూలుకి" అని కళ్ళెర్రచేసి నన్ను భయపెట్టేసారు.

ఇంక అప్పట్నుంచి పోనిలే అని వాళ్ళ కోసం స్కూలుకెళ్ళేదాన్ని. అప్పుడు కూడా నా అభిప్రాయాలకి విలువిచ్చేవాళ్ళు కారు. "స్కూలుకెళ్ళడానికి నాకు బలం కావాలి. గిన్నెలో వున్నదంతా నా ప్లేట్లో పెట్టేయ్. మొత్తం నేనే తింటాను" అని గాట్టిగా ఏడ్చినా సరే అమ్మేమో "నువ్వు తినవు. ఏడ్వవు. అంతా ఎంగిలి చేసి అక్కడ పెడతావు." అని కొంచెమే పెట్టేది.
స్కూలుకెళ్ళాక బోలెడు సమస్యలు, ఆకలేస్తే బొటనవేలు నోట్లో వేసి చీక్కూడదు. నిద్రొస్తే బరా బరా బుర్ర గోక్కోకూడదు. ఇంకా తిక్క లేస్తే పక్కన కూర్చున్న పిల్లని గట్టిగా గిల్లకూడదు. నెమ్మదిగా కూడా గిల్లకూడదు అనుకోండి. పలకం, బలపం అరిగిపోయి, చేతులు నొప్పెట్టేవరకూ అక్షరాలు దిద్దుతూనే వుండాలి.ఒకసారి అలానే ఏదో దిద్దుతున్నాను. ఈలోపు మేస్టారు బయటకి వెళ్ళారు. ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను. అదేమో మేస్టారు చూసేసారు.

"ఓయ్ అమ్మాయి పలక తీసుకుని ఇటు రా.." అని పిలిచారు. వెళ్ళాక, పలక తీసుకుని దాని మీద అక్షరాలన్నీ చెరిపేసి " నేను దిద్దించిన అక్షరాలు ఇప్పుడు చూడకుండా రాయి" అన్నారు. నాకేమైనా భయమా..! గబా గబా రాసేసి ఆయనకి చూపించాను. "ఏంటివి" అని అదిగారు. ""అ ఆ"లు అని చెప్పాను ధైర్యంగా. "అక్షరాలు రాయమంటే పిచ్చి గీతలు గీస్తావా..? మొద్దు పిల్ల. చెయ్యి పెట్టు" అన్నారు. చెయ్యి పట్టాక స్కేలిచ్చుకుని టపీ టపీమని రెండు కొట్టారు. దాంతో మేస్టారి మీద కోపం వచ్చి ఆ రోజంతా ఏడుస్తూనే వున్నా..అమ్మకి చెప్తే అయ్యోపాపం అనకపోగా "నువ్వు బాగా చదువుకోవాలి అని కొట్టారు." అంది.నన్ను మొద్దు పిల్ల అన్నారన్నా పట్టించుకోలేదు. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను.చించగా చించగా బంగారంలాంటి అవిడియా బుర్రలోకి వెలిగేసింది......

మర్నాడు అమ్మ చూడకుండా నా పుస్తకాల సంచీలో కొన్ని బొమ్మలేసుకుని బుద్దిగా స్కూలుకి బయదేరేసాను. మా ఇంటి సందు దాటి, కొంచెం దూరం నడవగానే సుధ పిన్ని వాళ్ళ ఇల్లు వచ్చింది. వాళ్ళింట్లోకి వెళ్ళాను. సుధ పిన్నితో "పిన్నీ నాకు బోల్డు జ్వరం. అమ్మ మీ ఇంటికెళ్ళి గిరీషుతో(వాళ్ళ రెండేళ్ళ బాబు) ఆడుకొమ్మంది" అని చెప్పాను. ఇంచక్కా నా బొమ్మలతో,ఆ బాబుతో ఆడుకుని నా తెలివితేటలకి మురిసిపోతూ, ఎగురుకుంటూ ఆనందంగా స్కూలు వదిలే టైముకి ఇంటికొచ్చేసాను. ఆ ప్లానేదో భలే వుందనిపించేసి,రోజూ వెళ్ళిపోతే పిన్నికి అనుమానం వస్తుందన్న భయం కూడా లేకుండా, రెచ్చిపోయి రెండో రోజు కూడా వెళ్ళిపోయాను.కానీ ఆ రోజే నా జీవితం ఒక దారుణమైన మలుపు తిరగబోతుందని నాకు తెలీదు..తెలిస్తే వెళ్ళేదాన్ని కాదేమో..! ఇంటికెళ్ళేసరికి అమ్మ గుమ్మం దగ్గరే నుంచుంది.

ఎత్తుకుని డైరెక్టుగా చీకటి గదిలోకి తీసుకెళ్ళింది. నాకు విషయం అర్ధమయ్యేలోపే "అబద్దాలు ఆడతావా..? అబద్దాలు ఆడి స్కూల్ మానేస్తావా..? అని చేతుల మీద, కాళ్ళ మీద, వీపు మీద ఒకటే బాదుడు. అసలే నాకు తెల్సీ మా అమ్మ కొట్టడం మొదటిసారి, దెబ్బలు తప్పించుకోవడంలో పెద్దగా అనుభవం లేదు. అందునా చీకటి గది. నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడుతుందో ఊహించి చేతులు అడ్డు పెట్టుకుంటూ, మెలికలు తిరిగిపోతూ,గాట్టిగా ఏడుస్తూ కాసేపు డిస్కో డాన్సే డిస్కో డాన్స్. కాసేపటకి నీరసం వచ్చి డాన్స్ ఆపేసి, ఏడుపు మానేసి, తప్పు ఒప్పేసుకుని "ఇంకెప్పుడూ స్కూల్ మానను. అబాద్దాలు ఆడను. ఇంక కొట్టద్దమ్మా..!" అని బతిమాలటంతో బతికిపోయాను.

అలా నా మాస్టర్ ప్లానులోని ఒక బుల్లి ఫ్లా వల్ల,సుధ పిన్ని నాకు చేసిన అన్యాయం వల్ల, స్కూలో జైలులా, చదువో కష్టాల చెరువులా ఎంత అనిపించినా మా అమ్మ వీర ఉతుకుడుని దృష్టిలో వుంచుకుని అప్పట్నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్దిగా స్కూలుకెళ్ళాల్సి వచ్చింది పాపం నేను......

27 comments:

చైతన్య.ఎస్ said...

అంతే విద్య ఈ పిన్నీలు, అమ్మలు ఇంతే, మనకు ఏం కావలో వీళ్ళకు తెలియదు. చిన్నప్పుడు మీరు నాలాగే కష్టాలు అనుభవించారు అన్నమాట!

Kathi Mahesh Kumar said...

హ్మ్మ్ పాపం మీరే..మీతోపాటూ చాలా మంది నాలాంటి వాళ్ళూకూడా.స్కూలంటే ఇప్పటికీ హమ్మో!

కల said...

ఇంతకీ, మన యోగం, భోగం, త్యాగం ఇత్యాదులన్నీ కలిసి, ఏదో మనం నానా యాగీ చేసే వాగిగా మారలేదు కదా? హ్హా హ్హా ఏదోలే సరదాకన్నాలేద్దూ.
బాగా కొట్టారా, పర్లేదు బాగా కొట్టాలి. అయ్ లేకపొతే చిన్నప్పుడే అబద్ధాలా, పెద్దైతే చెప్పొచ్చనుకోండి?
బావుంది మీ చదువు కష్టాలు. చదువుతుంటే నవ్వి నవ్వి కళ్ళవెంబడి నీళ్ళొచ్చేసాయి.

RG said...

Look who we have here...
Excellent Ms 'Lady Budugu' :)

Anonymous said...

బావుంది మీ దండించుకోవడ పురాణం.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిన్నప్పటినుంచే ఎన్ని తెలివితేటలో మరి?

సుజాత వేల్పూరి said...

నీ అల్లరి హద్దు మీరి నవ్వించింది పాపాయ్!
ముఖ్యంగా
"చదువు వచ్చి మనమీద పడ్డా
మనం వెళ్ళి చదువు మీద పడ్డా మనకే నష్టం"
జీవిత సత్యాన్ని ఆవిష్కరించావు పో!
అమ్మ అమ్మ!స్కూలు డుమ్మ కొట్టడానికి అమ్మనే మోసం చేస్తావా? హన్నా!

మీనాక్షి said...

అయ్యో అదా సంగతి .నా కథ కూడా ఇంతే విద్య గారు..చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళాలంటే చచ్చేంత భయం.
ఏది ఏమైనా కవిత మాత్రం సూపర్...
ఇన్ని రోజులు ఏమైపోయారో అనుకున్నా..
హమ్మయ్య వచ్చేసారా...
విద్యా అమ్మాజి కి జై జై జై..

కొత్త పాళీ said...

ఓపెనింగు సూపర్.
నాకు తెలీకడుగుతానూ, పెద్దవాళ్ళు ఇంత "ఆప్యాయమైన" పద్ధతుల్లో బాగా చదువుకోవాలని ఎవరికైనా చదువు మీద ఇంట్రస్టు కలుగ్తుంది?

జ్యోతి said...

విద్యా, అప్పుడే క్లాసు ఎగ్గొట్టే ప్లాన్ వేసావా? వామ్మో? మా తమ్ముడికి ఇలాగే రోజు పొద్దున్నే మొత్తం తయారయ్యాక, మమ్మల్ని స్కూలుకు తీసికెళ్ళడానికి ఆయా వచ్చే సమయానికి జ్వరం వచ్చేది ఉత్తుత్తిగా. నీట్ గా తయారయి అమ్మా నాకు ఇక్కడ జ్వరం వచ్చింది అని గొంతు దగ్గర చేయి పెట్టి చెప్పి వెళ్ళి మంచమెక్కేవాడు. అయినా ఆ పప్పులు అమ్మ దగ్గర ఉడకవుగా. ఇప్పటికి వాడికి ఆ సంగతులు చెప్పి నవ్వుకుంటాము.

Raj said...

బాగుంది. నాలాగే స్కూలు ఎగ్గొట్టడానికి ప్లానులు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అదిసరేగానీ, "ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను." కొంపదీసి జార్జి బుష్ మీ మాస్టారు కాదు కదా?

Narsingrao said...

chala baga rasaru... presentation excellent.... keep it up...

సుజాత వేల్పూరి said...

Raj
మీ కామెంట్ టాప్ గా ఉందండి!

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది శ్రీవిద్య గారు, మొదలు పెట్టడమే యోగం, భోగం, త్యాగం అంటూ సూపర్ గా మొదలు పెట్టారు ...తరవాత్తరవాత బుడుగు ని తలపిస్తూ చాలా చక్కగా వ్రాసారు... మీ కష్టాలు చూసి నవ్వుకున్నాను... ఎవరో మరీ బుద్ది మంతులకి తప్ప ఇంచుమించు అందరివి ఇవే కష్టాలేమో...

Raj మీ కామెంట్ సూపర్.

Anonymous said...

ఏం రాసేస్తున్నారండి. "మాస్టర్ ప్లాన్‌ లో బుల్లి ఫ్లా"
చక్కని హాస్యం.

-- విహారి

Niranjan Pulipati said...

భలే వుంది.. "ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను " కేక :)

MURALI said...

హమ్మయ్య శ్రీవిద్య చాలా రోజులకి.
"ఇంచక్క " బాగుంది ఇంచక్క.
"ఎందుకో నా పక్కన పిల్ల నన్ను గిల్లుతుందేమోనని అనుమానంగా అనిపించింది. అందుకే ముందుజాగ్రత్తగా నేనే గట్టిగా గిల్లేసాను" ఇది ఇంకా బాగుంది ఇంచక్క.
నేను చిన్నప్పుడు జ్వరం రావాలని పడుకొనేప్పుడు ఉల్లిగడ్డ పట్టుకొని పడుకోవటం, లేకపోతే వాంతులు కావటానికి ఇంగువ నోట్లో పెట్టుకోవటం చేసే వాడ్ని.

సుజాత వేల్పూరి said...

సీ గాన పెసూనాంబా,
నీ పుట్టిన్రోజా ఇవాళా! (జ్యోతి గారి బ్లాగు తెరుకోట్లేదు)
శతమానం భవతి!
ఇలా బోలెడన్ని పుట్టిన్రోజులు జాం జామ్మని నవ్వుతూ జరిపేసుకోవాలి మరి!

Kamaraju Kusumanchi said...

Wow! Superb!

Unknown said...

నిజమ్ గా చాలా బావుమ్ది, చాలా బావుంది, సూపర్ అసలు, అందరికీ ఎదురయ్యే జనరల్ టాపిక్ ని చాలా బా రాశారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు

చైతన్య.ఎస్ said...

శ్రీ విద్య గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటివి ఎన్నో మరెన్నెన్నో జరుపుకోవాలి మీరు!... మీరు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి.

వేణూశ్రీకాంత్ said...

Srividya gaaru belated happy birthday, Hope you had a great day.

Anonymous said...

Baboy...neeku intha talent vundhi ante..???
chimpeesav....
starting suuuuuuuuuuuuuuuuuuuuuuuper....
nee plan kuda super....1st roju bagundhi ani 2nd day vellatam inka super...

Srividya said...

@ చైతన్య : అవునండి మీలానే బోలెడు కష్టాలు పడ్డాను. అనీ చదువు కష్టాలే..

@కత్తి మహేష్ కుమార్ :అవునండి పాపం నేనే... మీరూ నా పార్టీయేనన్న మాట.

@కల: చిన్నప్పుడే వాగిగా మార్లేదు. కాల ప్రవాహంలొ ఎప్పుడో అలా మారిపోయాను.ఇంక దెబ్బలంటావా...? చేసిన ఘనకార్యానికి తప్పవుగా...

@RSG : Thanks

@ప్రతాప్: కదా.. కానీ ఏం చేస్తాం చెప్పండి? నా తెలివితేటల్ని ఎవ్వరూ గుర్తించటంలేదు :(

@సుజాత: థాంక్స్. ఏం చెప్పమంటారు చదువు బాధలు జీవిత సత్యాల్ని అలా నేర్పించేసాయి మరి :)

Srividya said...

@ మీనాక్షి: నీ టపాలు చూస్తేనే తెల్సిపోతుంది నీకూ మనలానే స్కూలు బెంగని. నాకూ రాయాలనే వుంటుంది. కానీ ఏం చేస్తాం. చిన్నప్పుడు చదువు కష్టాలు. పెద్దయ్యాక ఆఫీసు కష్టాలు. నా జీవితానికెప్పుడు ఫ్రీడం వస్తుందో..... :(

@కొత్త పాళీ: థాంక్సండి. ఆ మాత్రం దెబ్బల భయం లేకపోతే నాలాంటోళ్ళు వింటారా చెప్పండి. అయినా నేను చేసింది మామూలు ఘనకార్యమా..?

@జ్యోతి : ఇంట్లో మా చిన్నవాళ్ళకి ఈ కష్టాలన్నీ మీ పెద్దవాళ్ళ వల్లేనండి.. మీరెమో చక్కగా స్కూలుకి వెళతారు. బుద్దిగా చదువుకుంటారు. మేము అలానే చెయ్యల్సివస్తుంది. ప్చ్...

@raj: ఏం సెటైర్ వేసారండి అసలు. మా మేస్టారు పేరు అప్పుడు మాత్రం సుబ్బారావు గారు.తర్వాత జార్జి బుష్ అని మార్చుకున్నారేమొ మరి తెలీదండి.

@Narsingrao: థాంక్సండి.

@వేణూ శ్రీకాంత్ : థాంక్సండి. బుద్దిమంతులు వుండబట్టే నాలాంటి వాళ్ళకి ఈ కష్టాలు.. అందరూ స్కూలు మానేస్తే ఏ గొడవా వుండేది కాదు..

Srividya said...

@విహారి:చక్కని హాస్యం అంటూ కితాబిచ్చి, ప్రోత్సహిస్తుందునందుకు ధన్యావాదాలు.

@Niranjan Pulipati : :).నేను గిల్లినపుడు ఆ అమ్మాయి కూడా బానే కేకలు పెట్టిందండీ.

@murali: చిన్నపుడు నాకు ఉల్లిగడ్డలు అవిడియా తెలీదు. తెలిస్తే అంత రిస్క్ తీసుకునిదాన్ని కాదు. :). చాలా రోజులయ్యింది అంటే నేనెక్కడుంటే ఆఫీసుపని అక్కడ వుంటానంటుంది మరి.

@సుజాత: థాంక్స్ మీ విషెస్ కి. మీరు ఏం రాసినా భలే రాస్తారండీ.. అది కామెంటయినా.. టపా అయినా..

Kamaraju Kusumanchi: Thanks.

Srividya said...

@చైతన్య: థాంక్స్. అవునండి మనమంతా ఇలా నవ్వుతూనే వుండాలి ఎప్పుడూ..

@వేణూ శ్రీకాంత్ : Thanks for your wishes..ఈసారి మీ అందరి శుభాకాంక్షలు కూడా కలిసి ఈ సారి నా పుట్టినరోజుని మరింత స్పెషల్ చేసాయి.

@Harika: ఏదోలే నీ అభిమానం.ఇంకా రాయాల్సినవి ముఖ్యంగా మన కాలేజీ కబుర్లు బోలెడు వున్నాయి.

@జ్యోతి: ఈ టెంప్లేట్ నాకు బహుమతిగా ఇచ్చి, బ్లాగ్లోకం విషెస్ నాకు అందేలా చేసిన మీకు బ్లాగుముఖంగా బోలెడన్ని థాంక్స్ .

Harry said...

Chaala bavudandi. Nenu late ga chadivanemooo. ponilendi miss aithe kaledu...