Monday, March 24, 2008

గమ్యం - ఒక మంచి ప్రయాణం.

కొన్ని సినిమాలు చూసిన తర్వాత సినిమాలో అది బాలేదు,హీరో అలా చేస్తే బావుణ్ణు,ఆ పాటలో సెట్టింగ్ బావుంది ఇలా ఏదో ఒకటి తెగ విశ్లేషించబుద్దవుతుంది. కొన్ని సినిమాలు చూసాక మాత్రం అప్పుడే అయిపోయిందా,ఇంకాసేపు వుంటే బావుణ్ణు అనిపిస్తుంది.బయటకి వచ్చేసాక కూడా ఆ సినిమాలో నుంచి మనల్ని బయటకి రానీయకుండా కొన్ని సన్నివేశాలు మైండ్ లో మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతూ వుంటాయి. గమ్యం సినిమా అలానే వుంది.ఈ సినిమా అలా,ఇలా అంటూ సినిమా కథ సగం చెప్పేసి సినిమా చూడాలనుకుని ఇంకా చూడని వాళ్ళకి ఆ సినిమా చూసేటపుడు కలిగే అనుభూతిని అస్సలు చెడగొట్టదలుచుకోలేదు. సినిమా అంటె కేవలం వినోదానికే కాదు, అప్పడప్పుడు మనిషిని,జీవితాన్ని కొత్త కోణం లో చూపించి మనసుని తాకే ప్రయత్నం చెయ్యాలి అనే అభిప్రాయం వున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. చివరగా, చస్తూ,చస్తూ బఫరింగ్అయ్యే ఇంటెర్నెట్ లోనో, చూస్తున్నది సినిమానో,లేకపోతే సినిమా నీడో అర్థం కాకుండా వుండే పైరసీ సీడీ లోనో కాకుండా, ఒక మంచి సినిమా తీసినందుకు దర్శకునికి బహుమతిగా,సినిమా హాలుకెళ్ళి చూస్తే బెటర్.

2 comments:

రాధిక said...

మంచి మాట చెప్పారు

శాంతి said...

నిజం గా చాలా బాగా చెప్పారు. నాకు మీరు చివరిలో చెప్పిన మాట ఇంకా నచ్చింది. ఎంతో బాగున్న సినిమా లు కూడా కక్కుర్తి గా ఇంటర్నెట్ లో చూసేద్దాము అనుకోకుండా, దానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తూ, వారికి చెందాల్సిన క్రెడిట్ ని వాళ్ళకి అందిస్తూ బుద్ది గా సినిమా హాల్ కి వెళ్లి చూడడం మంచిది.