Wednesday, March 26, 2008

నింగి వంగి మరీ వెక్కిరించింది....

నింగి వంగి మరీ వెక్కిరించింది.
జాబిలమ్మ జాలిగా నవ్వింది.
పచ్చికేమో మొహం మీదే పక్కుమంది.
చల్లగాలి చిటపటలాడింది.
మబ్బులేమో మొహం ముడుచుకున్నాయి
నేలతల్లి మాత్రం అయ్యో నా బిడ్డ అంటూ బాధపడింది.
ఎందుకో తెలుసా...?
ఇంత అందమైన వేసవి రాత్రిని చూసి ఆస్వాదించే
ఓపిక లేదంటూ మొహం వేళ్ళాడేసుకుని, కాళ్ళీడ్చుకుంటూ
ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరిన నన్ను చూసి.......

5 comments:

రాఘవ said...

భలే వ్రాసారు.

Purnima said...

కొట్టకుండానే కొట్టారు.. చెంప చెల్లుమంది. ;-) నిజమే.. అలుపెరుగని ఈ ప్రయాణంలో , చుక్కల్లో చూపి నిలిపి, చుట్టూ ఉండే అందాన్ని మర్చిపోతున్నాము.

Anonymous said...

బాగు౦ది......

నిషిగంధ said...

బావుందండీ! :)

uma said...

బాగుంది, ఘాటు కొద్దిగ ఎక్కువైనట్లుంది.