Thursday, March 13, 2008

హమ్మయ్య.... వెయ్యి మైలు రాయిని దాటాను.

నా బ్లాగు మొత్తానికి 1000 హిట్ల గణాంకాన్ని దాటింది. అందులో ఇరవై శాతం హిట్లు నావే అయ్యీ ఉండొచ్చు. అధి వేరే విషయం. వెయ్యికే, లక్ష వచ్చినంత సంబరమా అనకన్డి.. సంబర పడకుండా ఎలా,ఒక అంకె సంఖ్య(0) నుంచి మూడు అంకెల సంఖ్యని(1000) చేరె ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగిపొలేదు మరి. బుర్ర నిండా విశేషాలు ఉన్నప్పుడు చేతిలో సమయం ఉండదు. సమయం ఉన్నప్పుడు, బుర్రన్తా ఖాళీగా ఉంటుంది. ఒక వేళ సమయం ఉంది,ఏదో గొప్ప ఆలోచన వచ్చిందని మొదలుపెడ్తాను, మొత్తం రాసేసరికి ఇంత చెత్తగా రాసింది నేనేనా, అని అనిపించేస్తూ ఉంటుంది. పోనీ ఆలోచన బానే ఉన్నా, నా అర, కొరా ఇంగ్లీషుతో కప్పడిపోయిన మంచి, మంచి తెలుగు పదాలని తవ్వడానికి కాస్త కస్టపడాల్సి వస్తుంది. (వేరే వాళ్ళ బ్లాగుల్లో మంచి మంచి తెలుగు పదాల్ని చూసి నాకు బోలెడంత ఈర్ష వచ్చేస్తుంది ఈ మధ్య). పోనీ అంతా రాశాము అనుకుంటే దానికో శీర్షిక పెట్టడానికి చుక్కలు కనపడ్తాయి. ఈ ప్రహసనం మొత్తం పూర్తి చేసి, పోస్ట్ చేశాక మళ్లీ చదువుతున్నారో లేదో అని కంగారు. ఇలా చెప్పాలంటే బొలెడు. కానీ ఎన్ని కబుర్లుచెప్పినా ఇష్టమైంది ఎప్పుడు కష్టమే కాదు అనుకోండీ.

ఈ ప్రయాణంలో నాన్ను చాలా మంది ప్రోత్సహించారు. మొదటగా కూడలికి నా కృతజ్ఞతలు. కూడలే లేకపోతే ఈ శ్రీవిద్య రాసింది,అంత మంది ఎలా చదువుతారు చెప్పండి.నా బ్లాగు చదివిన వారికి, వ్యాఖ్యలు రాసి,వారి అభిప్రాయాలు తెలిపిన వారికి అందరికి ధన్యవాధాలు.ఇక్కడ కొత్త, పాత బ్లాగరు అన్న భేధం లేధు. అందరినీ ఆదరిస్తారు. మళ్ళీ పది వేలయ్యాక ఇలానే సంబర పడుతూ ఇంకో పోస్టు రాస్తాను. చూడాలి ఎన్నాళ్లు పడుతోందో.

7 comments:

చిన్నమయ్య said...

అతి త్వరలో లక్ష రాయి దాటాలని ఆకాంక్షిస్తున్నాను.

శాంతి said...

శ్రీవిద్య గారు.. శుభాభినందనలు.. వ్రాస్తూ వుండండి. 1000 - 2000 వెళ్ళడానికి 0-1000 కి వెళ్ళడానికి పట్టిన సమయం కంటే తక్కువ పడుతుంది. ఎందుకంటే, మీ పాట టపాలు కూడా అందరూ చూస్తూ వుంటారు కదా!. ఆల్ ది బెస్టు మరి.

Satya said...

ఆఫీసు నుంచి బయటపడేముందు ఏదో సరదాగా కూడలిలో మీ టపా చూశాను. ఏంటబ్బా ఎవరో కొంచెం మనలాగా ఆలోచిస్తున్నారే అని, ఇంటికి వచ్చిన తరువాత అన్నీ చదివాను. అప్పుడు అర్ధమైంది నేను పరిణతి చెందితే ఇలాగే ఉంటానేమో, అందుకే మరొకరి ఆలోచనలను నాకు ఆపాదించుకుంటున్నానని....

ఇంకా మరీ బిజీ అయిపోయి పుట్టిన రోజుకి కాల్స్ వస్తున్నాయి.
"కొన్నాళ్ళకి కాలగమనంతో అవీ ఆగిపోవచ్చు."
పై వాక్యం నిజమే అయినా బాధ పెట్టింది...

My Everyday Post = నేను(After reading this post, I felt that somebody has picked those words from my heart)

వీడెవడ్రా బాబు కామెంటు రాయమంటే , పెద్ద పోస్టు రాసేస్తున్నాడు అనుకుంటున్నారు కదూ!!... శెలవు మరి..

S said...

all d best :) and congrats on reaching the 1000 mark.
నేను ఇదివరలో చూసినట్లు లేను ఈ బ్లాగుని...ఈరోజు చూస్తాను ఇక... :) యస్... మొదటి సారి వెయ్యి దాటినప్పుడు కలిగే ఆనందమే వేరు... 100కి ఒక్కో సున్నా పెరిగే కొద్దీ ఆనందం ఒక్కో ఉధౄతి తో కలుగుతుంది కాబోలు... :)

జాన్‌హైడ్ కనుమూరి said...

ArOjeMtO dUraMlEdu.........


all the best

జ్యోతి said...

అభినందనలు విద్యగారు,

ఒకప్పుడు మేము మీ స్థితిలోనే ఉన్నామండి. పర్లేదు.ఇప్పటినుండి త్వరగానే సున్నాలు కలుపుకుంటూ వెళ్ళండి.. ఆల్ ది బెస్ట్...

Srividya said...

మీ అందరి విషెస్ కి చాలా థాంక్స్.
నెల క్రితం ఎవ్వరైనా చదువుతారో లేదో అనుకుంటూ మొదలుపెట్టిన నాకు మీ అందరి ప్రోత్సాహం చాలా బలాన్ని ఇస్తోంది:).
@ satya: I am happy that u liked "My Everyday Post" :) . It is my first hence very special post for me.