Tuesday, March 11, 2008

మన హాకీ-మన జనం

పాపం మన వాళ్ళు బ్రిటన్తో జరిగిన మ్యాచులో పోరాడి, 0-2 తేడాతొ ఓడిపోయారు. ఎనభై ఏళ్ల భారత హాకీ చరిత్రలో ఒలింపిక్స్‌కి అర్హత సాదించటలేకపోవటం ఇదే మొదటాసారట. ఇదే సంఘటన పదెళ్ళ క్రితం జరిగితే జాతి ఎలా స్పందించేదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం విపరీతంగా స్పందిచేస్తుంది(మీడియా స్పందించేదాకా ఊదరగోడుతోంది అనడం సబబేమో)

ఇంకా సమాజం కోసం తెగ పాటు పడిపోయే, ఒక ఇంగ్లీష్ టీవీ చానల్ వాళ్ళయితే మీ అభిప్రాయాలు మయ ఫోన్ ద్వారా అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నెత్తినేసేసుకున్నారు. ఇంక కార్యక్రమం వివరాల్ళోకికి వెళ్ళిపోతే, కొన్ని అమూల్యమైన అభిప్రాయాలు అభిప్రాయాలు నా చెవిన పడ్డాయి.

ఒకటో కాలర్: నేనైతే కోచ్, ఆటగాళ్ళ వైఫల్యం అనుకుంటున్న అని అన్నాడు (నాకో డౌట్. అతనెప్పుడైనా హాకీ మ్యాచ్ చూసాడా? వళ్ళెవరి పేర్లైనా తెలుసా అని)

రెండో కాలర్: పాపం ఈవిడ ఎవరో కొంచెం పద్దతి కలావిడలా అనిపించింది. మీరు జాతికే సిగ్గు చేటు అని ప్రసారం చెయ్యడం పట్ల నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆటన్టె గెలుస్తాం, ఓడతాం. అన్దులో సిగ్గుపడ్దానికి ఏముంది అంది. టీవీ వాళ్ళు క్రీడా స్పూర్తితో తమ తప్పు సరిచేసుకుంటారేమో అనుకొన్నా.కానీ ఎప్పటిలానే వారి విలువల విషయంలో నా అంచనాలను తారు మారు చేస్తూ, మన ఏంకర్ గారు ఎన్దుకనకూడదు. హాకీ మన జాతీయ క్రీడా(ఇప్పటకి గుర్తు వచ్చిందేమో) అందులో దారుణంగా ఓడిపోవడం సిగ్గు చేటే మరి అని సమర్దించేసుకున్నాడు.

మూడో కాలర్: కాలంలో హాకీ అంటే ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. కాలంతో పాటే మనమూ మారాలి. హాకీని జాతీయ క్రీడగా తీసేసి, క్రికెట్ పెట్టండి అని సలహా పారేసాడు.(వార్నీ..... ఇలాంటి జనాలు కూడా ఉంటారా...? రేపెప్పుడైన ఆదరణ లేకపోతే మన పేర్లు, ఊరి పేర్లు, అలవాట్లు అన్ని మార్చేసుకోవాలేమో. ప్చ్.. కలికాలం).

నాలుగో కాలర్: ఇది మొత్తం హాకీ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. ఇందుకు నేను చాలా సిగ్గుపడుతున్నానని తెగ భాదపడిపోయాడు. (వీడెవడికో రాజకీయ నాయకుడి లక్షణాలు బాగా ఉన్నాయి)

ఐదో కాలర్: ఈయన మాటలు నాకు బాగా నచ్చాయి. మన దేశములో క్రికెట్ తప్ప వేరే ఆటకి ప్రోత్సాహమే ఉండదు.ఆసియా కప్ గెలిచి వస్తే పట్టించుకున్న నాధుడే లేదు. పరమ చెత్తగా క్రికెట్ ఆడే ఆటగాడు కోటీశ్వరుడు ఐతే,అద్బుటంగా హాకీ ఆడే బీదవాడు అయి ఉంటాడు. ఇకెన్కడి నుంచి వస్తుంది మోటీవేషన్. క్రికెట్ ఆతగాళ్ళు ఐదు నక్షత్రాల హోటెల్లో బస చేసి, ప్రధానితో ముచ్చట్లాడుతుంటే, హాకీ ఆతగాళ్ళు ఒక చిన్న హోటేల్లో,రెండు రోజులు ప్రధానిని కలవటం కోసం వేచివున్నారు అని మా బాగా వివరించి చెప్పారు.

ఆరో కాలర్: చక్ దే ఇండియా షారూక్ ఖాన్ తప్పు ఇదంతా అని చెత్త జోక్ వేసాడు.( రామయణమ్లో పిడకల వేటలా జోక్ వెయ్యడం అవసరమా..? ప్రజాస్వామ్యం)

ఏడవ కాలర్: ఈవిడెవరో అందరి కన్నా భిన్నంగా మాట్లాడాలని తాపత్రయ పడింది. అంతా క్రికెట్ని మధ్యలో నింధిస్తున్నారు. హాకీ సమాఖ్య కూడా బీసీసీ వాళ్ళలా ఆటగళ్ళని ప్రోత్సహించాలి, ప్రతిభని వెతికి పట్టుకోవాలి. అన్ని చోట్ల హాకీ ఆడ్డానికి సదుపాయాలు పెంచాలి అని ముగించింది (పాపం మన ఏంకర్ ఏడ్వలేక నవ్వుతూ, ఇవ్వన్నీ చెయ్యడానికి డబ్బులేకే కదా తిప్పలన్నీ అని అన్నాడు) అదీ అసలు సంగతి.

మన భారత జాతి క్రికెట్ తప్ప వేరే ఆట చూడదు. ఆటకి ఆదరణ లేకపోతే ఎవ్వరూ స్పాన్సర్ చెయ్యరు. కావున డబ్బులు ఉండవు.ఐనా ఆటగాళ్ళు దేశం కోసం కష్టపడి ఆడెయ్యాలి. ఒకవేళ కష్టపడి గెలిస్తే మన పట్టించుకోం. ప్రభత్వం రూపాయి విదల్చదు (జాతీయ క్రీడా ఐనా సరే) ఓడిపోతే మాత్రం జాతి మొత్తం భాదపడిపోతాం. అందర్నీ దుమ్మెత్తిపోసేస్తాం. జాతీయ క్రీడ కదా..... హాకీ క్రీడా వ్యవస్తలో తేడాలు, లూకలుకలు ఉంది ఉండచ్చు. కానీ రేన్జులో దుమ్మెత్తిపోసే అర్హత మన భారత జాతికి ఉందా అని నా అనుమానం.

ఇదంతా చూసిన తల్లితండ్రులు తమ పిల్లల్ని ఆడితే క్రికెట్ ఆడు లేదన్టే బుద్ధిగా బట్టీ కొట్టి, ఇంజినీరింగ్ చదివి, సాఫ్త్వేర్ ఇంజినీర్ అవ్వు అని హింసించినా ఆశ్చర్యపోనక్కర్లేదు

7 comments:

Anonymous said...

I agree with u ..

Anonymous said...

Title endhuku marceve..??

Unknown said...

చాలా బాగా రాశారు. "స్పందించేదాకా మీడియా ఊదరగొడుతోంది అనడం సబబేమో" :)

జాన్‌హైడ్ కనుమూరి said...

baaguMdi vivaraNa
idi kUdaa cUdoccu

http://johnhaidekanumuri.blogspot.com/2008/03/blog-post_2268.html

Uday said...

వెయ్యి హిట్టులు వచ్చిన సందర్భంగా నా అభినందనలు

S said...

బాగుందండీ మీరు రాసిన విధానం... మీరన్న ఆ తలకాయల వ్యాఖ్యానాలు మళ్ళీ మనుషుల్లోని భిన్నత్వాన్ని చూపిస్తున్నాయి... :)

Anonymous said...

nijame... cricket lo gelichinappudu abhinandistoo parliament lo teermaanalu chesina Govt, kaneesam deeni gurinchi matladatam kuda ledu.
:((