నా తొమ్మిదో తరగతి నుంచి నాకు కవితలు రాసే అలవాటు ఉండేది. అప్పట్లో నేను పెద్ద రచయిత్రి అయిపోవడం అనేది నా రెగ్యులర్ పగటి కల. తర్వాత బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడు హాయిగా, ఆనందంగా ఉండచ్చు అనుకుని, ఈ అభిరుచులన్నీ నా ఏగాగ్రతకి భంగం అనుకుని అస్సలు రాయడమే మానేసాను. ఎప్పుదో విపరీతమైన దుఖంలో వున్నప్పడు రాసేదాన్ని. కాబట్టి అవి పరమ ఏడుపుగొట్టు సీరియల్ స్క్రిప్టుల్లా ఉండేవి.
చదువయ్యింది. మంచి జాబ్ వచ్చింది. ఐనా నాలో ఏదో అసంతృప్తి. మనకి మంచి జాబ్ వస్తే , వేరే వాళ్ళకి చాలా చాలా మంచి జాబ్ వస్తుంది. ఎంత ఎదిగినా, ఎన్ని మార్పులొచ్చినా జీవతం జీవితమే,చిన్నావో, పెద్దవో సమస్యలు లేకుండా లేక మనంతటా మనం క్రియేట్ చేసుకోకుండా ఇతే రోజు గడవదు. ఏమీ చేస్తే ఆనందంగా ఉంటాను అని ఆలోచించీ, చించీ భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ రాయాలి అని నిర్ణయించేసుకున్నాను. ఇంకా రాయడం మొదలు పెట్టాక అంతటితో ఆగదు కదా... నేను రాసిన సోదిని చదివే పాఠకులు కావాలి అనిపించింది. కస్టపడి రాసిన తర్వాత ఎవ్వరూ చదవకపోతె అబ్బా ఎందుకు రాయాలి అనే నిరాసక్తత ఆవహిస్తున్ది. వున్నవి చాలక , ఈ నిరుత్సాహం ఒకటా అనిపిస్తుంది...ఐనా నన్ను రాయకుండా ఎవ్వరూ ఆపలేరు. అది వేరే సంగతి :)
అదలా ఉంచితే నిన్న నా క్లోజ్ ఫ్రెండ్ మెయిల్ పెట్టింది.. నీ బ్లాగు చదువుతుంటే నువ్వు నా పక్కనే వున్నట్టూ నాతో మాట్లాడుతున్నట్టు అనిపించిందే.. ఎందుకో మన కాలేజ్, హాస్టల్ రోజులు గుర్తు వచ్చాయే అని ఆ మెయిల్ సారాంశం.
అప్పట్లొ నేనో తోకలేని కోతి. అప్పుడు అనిపిన్చిన్ది.ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవ్వరికీ కలసి ముఖాముఖి పది నిముషాలు మాట్లాడే తీరిక లేదు అని. వెంటనేనేను చదివిన ఒక పుస్తకంలో డైలాగ్స్ గుర్తు వచ్చాయి.
"మాట్లాడే మాటల కన్నా కాగితం పైన అక్షరాలు మనసుకి తొందరగా హత్తుకుంటాయి. దూరాన్ని దగ్గర చేస్తాయి". ఒక్కొక్కరికి నేనిక్కడ క్షేమం నువ్వు క్శేమమేనా అంటూ మొదలు పెట్టి, నా జీవిత చరిత్రంతా లేఖలు రాసే తీరిక ఎలానూ లెదు.ఇలా ఐనా వాళ్ళకి నా మనసులో ఎలాంటి ఆలోచనలు(దురాలోచనలో, సదాలోచనలో ఏవో ఒకటి) సాగుతున్నాయి, నేను ఎలా ఉన్నాను, ఏమీ చేస్తున్నాను,నా అభిప్రాయాలు ఎలా మారుతున్నాయి అని వాళ్ళకి చెప్పడానికైనా రాయాలి అని అనిపించింది. పనిలో పనిగా కొంత మంది కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు :).
8 comments:
Finally ni destination thelsukuni reacha yyavu kda...gud... :)
andharu chadhavtam antaava time paduthundhi emo....chudhhamm.....
నేను కూడా నా స్నేహితులను పలకరిద్దామనే బ్లాగు మొదలుపెట్టాను.నన్ను మీ కొత్త స్నేహితుల లిస్టులో చేర్చుకోండి.
తప్పకుండా రాధిక గారూ.. అంత కన్నా భాగ్యమా.....
Ur style is very entertaining :) keep going. రచయిత్రి ని కావడం అన్నది నాక్కూడా చిన్నప్పుడు రెగులర్ కల. మనం మనం ఒకే పార్టీ అనమాట.. :))
"S" గారు నా పోస్టులన్నీ ఓపికగా చదివినందుకు చాలా ధన్యవాధాలు.You really made my day with all your compliments :). మీరు పేరు చెప్పచ్చుకదండీ, ఎంతైనా మనం మనం ఒకటే పార్టీ. (రచయిత్రి కావడం)
నేనే...ఎస్ ని. మీరు ఆ లంకె పట్టుకు వెళ్ళుంటే నేనెవరో కనుక్కుని ఉండొచ్చు.. :) నా పేరు సౌమ్య.
http://vbsowmya.wordpress.com అన్నది నా బ్లాగు. :)
Hi,
meeru misso leka misseso teledu kani,nenu mumbai lo job chestunnanu mi rasinavi chadivanu chala bga unnayandi,if u don't mine telugu lo ela type cheyyalo cheptara
pi comment from
kadapavijaysattar.blgspot.com
or
blog.co.uk
my mailid:vijaysattar@gmail.com,am new for using blog
Post a Comment