Wednesday, February 13, 2008

ఆ రోజులు ఏమయ్యాయి................???

కాలేజీలో రోజు గంటలు గంటలు సొది చెప్పుకోవడానికే సరిపోయేవి కాదు.
కాలేజీ అయ్యాక జాబ్స్ వచ్చాయి.
ఆఫీసులు వేరు అయ్యాయి.మాటలు తక్కువ అయ్యాయి.
ఎవరి లోకం వాళ్ళదిఎవరి కష్టాలు వాడివి.
మనం చెప్పాలి అనుకున్నపుడు వాళ్ళకి టైమ్ ఉండదు
వాళ్ళు వినాలి అనుకున్నపుడు మనకి చెప్పడానికి ఏమీ ఉండదు.
రోజులో గంటలు చెప్పుకునే కబుర్లు
కొన్నాళ్ళకి రోజుకి కొన్ని నిముషాలు పరిమితం అయ్యాయి.
రోజు కాస్త రెండు రోజులకీ ఒకసారి అయ్యింది.
రెండు రోజులు కాస్త వీకెండ్స్ అయ్యాయి.
వీకెండ్స్ మీటింగ్స్ కాస్త వీలైనప్పుడు, కుదిరినప్పుడు,పని లేనప్పుడుకి మారాయి.
ఇంకా మరీ బిజీ అయిపోయి పుట్టిన రోజుకి కాల్స్ వస్తున్నాయి.
కొన్నాళ్ళకి కాలగమనంతో అవీ ఆగిపోవచ్చు.

Tuesday, February 12, 2008

పాపం మన వాళ్ళకి దిష్టి తగిలింది.

మొన్న Sunday, ఆస్ట్రేలియాని మన వాళ్ళు ఓడించగానే కత్తి, బాకు అంటూ పొగిడేశారు. పాపం ఆ దెబ్బకి మన వాళ్ళకి దిష్టి తగిలిఈరోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయారు. పొగడటం అంటే మామూలుగా కాదుగా.భావి భారత ఆశ కిరణం, ప్రపంచాన్ని శాసించే ఉత్తమ ఆటగాడు అంటూ ఒకటే ఊదరగొట్టుడు. ఇక పని పాటా లేని వాళ్ళంతా టీవీలో కలిసి భారత క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక అపురూపమైన ఘట్టం. అమూల్యమైన విజయం అంటూ సొది కబుర్లు. ఈ మ్యాచ్ గెలిచినా ఇదే గోలా... ఇంకా రిప్లెలు మీద రిప్లెలు వేసి మధ్యలో ప్లేయర్స్ Lip movement ఇచ్చినా నవ్వినా, ఏడ్చినా ఆ Experessions Translation.

Srisaanth ఇలా అనుకుని ఉంటాడు కాబట్టి అలా నో బాల్ వేసి ఉంటాడు . Sachin ఇలా అనుకుని ఉంటాడు కాబట్టి అలా బ్యాట్ ఊపి ఉంటాడు అని చావాగోడుతూ ఉంటారు. ఆ విషయాలన్ని వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టు. ఎలాను పిచ్చి ప్రేక్షకులు(అంటే మనం) అలా అన్నారో లేదో ప్లేయర్స్ ని అడిగి confirm చేసుకోలేరు.జనాలు వినాలి అనుకునేవీ అన్ని( ప్లేయర్స్ అనుకుని ఉంటారు అంటూ) వాళ్ళు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తునే ఉంటారు. నిజమే కాబోలు అనుకుంటూ మనం అదేదో భారతంలా మళ్లీ మళ్లీ వింటూనే ఉంటాం. మరి ఓడిపోతే సీన్ రివర్స్.మనకి మళ్లీ ఇంకో మ్యాచ్ గెలిచే వరకు క్రికెట్ అంటే టెంపరరీ అయిష్టం.

Monday, February 4, 2008

ఆన్ని ఆదివారాలు ఒకేలా వుండవు

ఒక మంచి ఆదివారం ప్రొద్దున్నె నిద్ర లేవగానే(అంటే నాలాంటి వాళ్ళ భాషలొ 9 అని మాట).గత కొన్ని నెలలుగ నన్ను సతాయిస్తున్న సమస్యకి సమాధానం దొరికింది. నా బ్లాగులో తెలుగులో ఎలా రాయాలొ తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న నాకు ఈనాడు Sunday Special ఒక దారి చూపించింది.http://lekhini.org open చేసి, మీరు రాయలని అనుకున్నదంత రాసేసి convert ఐన తెలుగు పోస్టుని మీ బ్లాగులో కాపీ చెసేసుకొండి.ఇక తెలుగు మనసుకి ఇంగ్లిష్ కష్టాలు వుండవు.Thanks to eenadu. Thanks to lekhini team.