నేస్తం
ఎంత పరిగెత్తావు నేస్తం?
గమ్యం వెంట ఎంత వేగంగా , ఆత్రంగా పరిగెత్తావు నేస్తం?
అలసిపోయి పరుగు ఆపి అవలోకిన్చుకుంటే,
మనసు పొరల్లో ఆనందపు నీడల్లో సేద తీరదామంటే ,
అదేంటో చిన్ననాటి చిలిపి అల్లర్లు పలకరిస్తున్నాయి.
గోదారి గాలి, కీచులాటలు,తెలుగు పద్యాలు,దూరదర్శన్ సినిమా , ఈనాడు ఆదివారం అనుబంధం మెదులుతున్నాయి.
మరి మిగిలిన కాలమంతా ఎక్కడ జారిపోయిందో?
విజయాల వేటలో మజిలీలు దాటి చాలా దూరం వచ్చాక తెలుస్తుంది, అసలీ గమ్యమో ఎండమావని చిన్ని చిన్ని మజిలీలే నిజమైన సంతోషాలని.
3 comments:
>>>సలీ గమ్యమో ఎండమావని చిన్ని చిన్ని మజిలీలే నిజమైన సంతోషాలని<<
నిజమండీ. బావుంది. బాగా రాశారు.
@శిశిర గారు : ధన్యవాదాలండి :)
Ending superb:):)
Post a Comment