కొన్ని బంధాలు దృఢమైనవి. ఎంత దృఢమైనవంటే ఎలా చెప్తాను? భూకంపాన్ని రిక్టరు స్కేలుతో కొలిచినట్టు బంధాల దృఢత్వాన్ని అంత వీజీగా కొలవలేము. అవి అంటుకుంటె వదల్నై తుమ్మజిగురులా, బంకమన్నులా మనల్ని అలా అంటిపెట్టుకుంటాయంతే. అలాంటి ఒక విభిన్న, వినూత్న, విలక్షణ, వైవిధ్యమిన బంధాన్ని మీకీరోజు పరిచయం చెయ్యబోతున్నా. ఆ బంధమే నాదీ, నా కళ్ళజోడుదీ. నాకు నా చిన్నప్పుడు కళ్ళజోడంటే విపరీతమైన ఆరధనా భావం వుండేది.కళ్ళ జోడంటే ఎందుకంత ఆరాధనా భావమంటే
1) సినిమాల్లో లాయర్లు, మేస్టార్లు, డాక్టర్లు కళ్ళజోడు పెట్టుకునేవారు
2) మాయదారి మల్లిగాడికి, సోగ్గాడికి, దసరాబుళ్ళోడికి కళ్ళజోడు వుండేది కాదు.
3) ఎక్కువ మాట్లాడకుండా, వాళ్ళావిడ అరుస్తున్న పట్టించుకోకుండా, ఎప్పుడూ పేపర్ చదువుకుంటూ(చదువుతున్నట్టు నటిస్తూ!) అపర మేధావిలా కనిపించే పక్కింటి తాతగారికి పేద్ద, పేద్ద, బండ, బండ కళ్ళద్దాలు వుండేవి
4) అశోకుడు చెట్లు నాటించాడు, వాటి మొక్కలకి ఎంటీ రామారావు నీళ్ళు పోయించాడని చరిత్రని, రాజాకీయాలని కలిపి ఖూని చేసేస్తూ మా బుర్రలని గరిటెతో తినేసే మా సోషల్ మేస్తార్కి కళ్ళజోడు వుండేది కాదు
5) కష్టపడి నాలుగు రాసాను కదా..! కళ్ళజోడు మీద నాకున్న ఆరధనా భావాన్ని ఒప్పేసుకోవచ్చు కదా..!
పై కారణాల వల్ల కళ్ళద్దాలు మేధావితనానికి ప్రతీక, పదునైన మెదడుకి వుండాల్సిన అర్హత,చురకైన బుర్రకి ఆభరణంలాంటి వెర్రి వెర్రి నమ్మకాలతో నా తలకాయ్ నిండి పుండయిపోయింది. అలా కొన్నేళ్ళపాటు మూగగ కళ్ళద్దాలాని ఆరాధించగా, ఆరాధించగా దేవుడు నా ఆరాధనని మెచ్చి, నా మేధావితనం నచ్చి ఒక కళ్ళజోడుని ప్రసాదించాడు. ప్రసాదించడం అంటే డైరెక్టుగా కాదన్న మాట దేవుడు కదా! అందుకని నాకు బాగా తలనొప్పి రప్పించి, ఒక కళ్ళడాక్టరు దగ్గరకి పంపించి, ఆయన ద్వరా నాకు కళ్ళజోడు, నా ద్వారా ఆయనకో వంద ఫీజు, కళ్ళజోడు షాపులో కమీషన్(ఆయన కూడా బ్రతకాలిగా) ఇప్పించాడన్న మాట. అదన్న మాట సంగతి.
అప్పటిదాకా నేను మేధావిని అని గుండెల్లో గుట్టుగా వున్న ఫీలింగ్ కాస్తా కళ్ళలోంచి తన్నుకొచ్చి, కళ్ళజోడులోంచి దూసుకొచ్చేస్తుంటే అప్పుడు చూడాలి నాసామి రంగా,దానికి తోడు మా హాస్టల్లో అమ్మయిలంతా కళ్ళుజోడు పెట్టుకున్న నన్ను చూసి, తెల్సా అచ్చు ప్రొఫెసర్లా వున్నావు. భలే వున్నవు తెల్సా అంటుంటే నేనేమో ఉబ్బితబ్బిబ్బయి,ఉక్కిరిబిక్కిర ఉప్మా అయిపోయేదాన్ని.అప్పట్నుంచి ఎంత మాడెస్ట్ గా వుందామన్నా ఉత్తి మేధావి నుంచి అపర మేధావిగా ఎదిగిపోయిన ఫీలింగ్.
కొన్ని భయంకరమైన నిజాలు ఎందుకో మన ముందుకు వెంటనే రావు.కొన్నేళ్ళు మనని శునకానందంలో ముంచీతేల్చీ మళ్ళీ ముంచీ విపరీతంగా ఆనందించి అప్పుడు బయటికొస్తాయి.మెట్ట వేదాంతం ఆపి,విషయంలోకి రావచ్చు కదా అనుకుంటున్నారా? వచ్చేస్తున్నా.వచ్చేస్తున్నా. ఓరోజు పాస్ పోర్ట్ అప్లయి చెయ్యడానికిఆఫీసుకి వెళ్ళాను. నేను అక్కడ క్లెర్క్ కోసం చిరాగ్గా వెయిట్ చేస్తుంటే నా కోసం ఒక భయంకరమైన నిజం తీరిగ్గా వెయిట్ చేస్తుందని నాకసలు తెలీదు. క్లెర్క్ రాగనే వాడి చేతిలో అప్లికేషన్ ఫార్మ్ పెట్టను, వాడు అప్లికేషన్లో వున్న నా ఫొటో తీక్షణంగా చూస్తుంటే, పోనిలే ఆ ఫోటో కళ్ళజోడులొంచి దూసుకొచ్చే మేధావితనాన్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం తీక్షణత అవసరంలే సరిపెట్టేసుకున్నాను. కాసేపు ఫోటో చూసాక, సరేమ్మా మీ అమ్మగారి పాస్‌పోర్ట్ రెడీ అవ్వడానికి ఇంకో నెల పడుతుంది అనేసాడు. అంతే కరెంట్ షాకు కొట్టిన కాకిలా కొంచెం సేపు గిలగిలా కొట్టుకుని, మౌనంగా రోదించి "సార్. అది మా అమ్మ కాదు. నేనే సారు" అని మాత్రం అనగలిగాను. ఆయనేమో బోలెడంత ఆస్చర్యపడిపోతూ నా వంక, ఫొటొ వంకా మార్చి మార్చి చూసి "తల్లీ నీకు కళ్ళజోడుందా, వుంటె అదొకసారి పెట్టుకోమ్మా" అన్నడు. నేను భయభయంగా తెసి, మొహమాటంగా పెట్టుకున్నానో లేదో వెంటనే "నీదే నీదే ఈ ఫొటొ, ఇంకా మీ అమ్మగారు అనుకున్నాను నీదేమ్మా" అంటూ ఏదో గ్రహంతర వాసుల ఉనికి తనొక్కడే కనిపెట్టేసినట్టు తెగసంబర పడిపోయాడు సోదిమొహంగాడు.
అక్కడ నుండి బయటకి రాగానే నేను మొదట చేసిన పని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ నా ఇంటర్ రూమ్మేట్ కావ్యకి ఫోన్ చెయ్యడం."ఒసేయ్ కావ్యా నేను మీకేం అన్యాయం చేసానే?నెను కళ్ళజోడు పెట్టుకుంటే ఆంటీలా వుంటానన్న విషయం సూటిగా చెప్పకుండా, దానికి పౌడరు రాసి,మేకపు చేసి ప్రొఫెసర్ వున్నానని చెప్పి నన్ను మోసం చేస్తారా..?" అని ఉరుమే ఉలిక్కిపడెంత గట్టిగా గర్జించాను.(కొంచెం ఎక్కువయ్యింది కదా..!)
"అది కాదే నువ్వు మనం ఇంటెర్లో వున్నపుడు ఒక కథ రాసావు గుర్తుందా?" అంది కొంచెం సందేహిస్తున్నట్టు గా.నేను ఇంటెర్లో ఇంటెర్ పుస్తకాలే చదవాల్సి వచ్చేది.దాంతో బాగా బోరు కొట్టి నేనే కథలు రాసుకుని చదువుకునేదాన్ని.పాపం మా వాళ్ళకి కూడా ఫ్రతిఫలేక్ష లేకుండా నా కథలన్నీ ఫ్రీగా చదివి వినిపించేదాన్ని.ఆ రోజులు గుర్తొచ్చి తెగ సంతోషంతో గుండె బూరెలా ఉబ్బిపోయి "ఒక కథేమిటి నీ బొంద.బొలెడు కథలు రాసేదాన్ని" కొంచెం గర్వంగా అన్నను."అవునే చాలా........ కథలు.ఒక కథలో హీరో వుంటాదు.హీరోయిను వుంటుంది.వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు.విడిపోతారు.మళ్ళీ కల్సిపోతారు.కథ మొత్తం అలా విడిపోతూ కలుస్తూ వుంటారే. చివరాఖరికి అయినా కలుస్తారో లేదో గుర్తు లేదే.. ఆ కథ చదివి మీ హీరో,హీరోయినుకి కలవడం విడిపోవడం తప్పితే వేరే ఉద్యోగం సద్యోగం లేదా అని అడిగితే మీకు కధారాధన రాదు, కళాపోషణలేదు అంటూ గంట సేపు తిట్టి, అలిగి నాలుగు రోజులు కాలేజీకెళ్ళడం మానేసావు చూడు.అపుడే అందరూ కల్సి తీర్మానించేసుకున్నమే. నీకు జన్మలో నిజంగా నిజాన్ని నిజంలా మాత్రం చెప్పకూడదని." అంది.
అది విని నాకు చాలా చిరాకేసింది.అది నా కళ్ళజోడుని,నా కథల్ని,నాలో కళకారిణిని కలిపి అవమానించింది.అప్పుడే నేనో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను.కథలు రాయడం మానేయాలని అనుకున్నానేమొనని హమ్మయ్య నుకుంటున్నరా?అబ్బా ఆశ దోస అప్పడం వడ,అది కానే కాదు,ఎలాగైనా నా కళ్ళజోడుని వదిలించుకోవాలని.
అలా వదిలించుకునే క్రమంలో కాలగర్భంలో కొన్నేళ్ళు కల్సిపోయాయి.నన్ను మాత్రం నా కళ్ళజోడు వదల్లేదు.దాన్ని మందం మాత్రం బాగా పెరిగింది. ఒక రోజు చల్లని మీటింగ్ రూములో ఓ పిల్ల మేనెజర్ ఏమి చెప్పి నాకన్నీ తెల్సు అని వీళ్ళని ఒప్పించాలా అని దీర్ఘాచనలో వున్నాడు. నేనేమో సిన్సియర్‌గా ఒళ్ళు మరిచి, కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా అని ప్రాక్టిస్ చేస్తున్నను.అలా మా టీం మొత్తం ఎవరి సీక్రెట్ అగెండాతో వాళ్ళు కుస్తీపడుతున్న ఆ క్షణాన నాకొక భయంకరమైన సత్యం తెల్సింది. ఆ రూములో ఇరవై మందిలో పదిహేను మంది కళ్ళద్దలు లేకుండా వళ్ళా సొంతకళ్ళతో కళకళ్ళాడిపోతున్నారు.ఇంకాపుకోలేక నా పక్కనున్న వాడినికుతూహలంగా అడిగాను "నీకెందుకు కళ్ళజోడు రాలెదని" అని. వాడేమో జాలిగా, కోపంగా, దీనంగా, చిరాగ్గా, విసుగ్గా, అసహ్యంగా, నిరాశగా, నీర్సంగా కాసేపు చూసి (నాకు తెల్సీ మేనేజర్‌కి ఫ్రస్టేషన్ వెళ్ళగక్కడం అన్న విషయంమీద లోతుగా పరిశోధన చేసుకుంటున్నట్టు వున్నాడు) "నేను లెన్స్ పెట్టుకున్నా" అని చెప్పేసి శూన్యంలో తల తిప్పేసి మళ్ళీ ప్రాక్టీసు మొదలెట్టేసుకున్నడు.
ఆ దెబ్బకి ఒక కాంతి పుంజం, ఒక వెలుగు రేఖ నా కళ్ళజోడుని చేదించి నా కళ్ళని తాకగానే, నా మనసు కొన్ని వందల వంకర్లు కొన్ని వేల టింకర్లు పోయి కటకాల(లెన్స్)మీదకి మళ్ళిపోయింది.వెంటనే పతియే ప్రత్యక్ష దైవం అని చిన్నప్పుడెప్పుడో విన్న డవిలాగు గుర్తొచ్చి "ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటండీ" అని మా ఆయన్ని అడిగాను.మా ఆయనేమో "నీ ఇష్టం రా.నీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యు" అనేసారు సింపుల్‌గా.
అసలు "లెన్సా,ఏమొద్దు"అని చెప్తే "ఆయ్ నేను అంత ముచ్చటపడి అడిగితే వద్దు అంటారా?ఏంటంత పురుషాహంకారం,మగ దురహంకారం, ఉల్లిపాయ కారం,సూదిలో దారం అంటూ ఆవేశంతో ఊగిపోతూ మా ఆయన్ని సాధించడానికైనా ఆ పని చేసేదాన్ని.పొనీ అలా కాకుండా "కొనుక్కోరా.ఈ కళ్ళజోడులో అమ్మాయివి కాస్తా ఆంటీలా కనపడుతున్నావు.నీకు లెన్స్ బావుంటాయి.బాగా సూట్ అవుతాయి" అని నన్నో అరగంట పొగిడినా మురిసిపోయి,ఆనందంలో తడిసి ముద్దయిపోయి ఆ ఉత్సాహంలో అనుకున్నది కాస్తా చేసేదాన్ని.కానీ ఈయనగారేమో పెద్ద స్వేచ్చావాది.ప్రతీదానికీ నీ ఇష్టం నీ ఇష్టం అంటే నాకేమో మండిపోయి,అసలు నాకేది ఇష్టమో తెలీక కంఫ్యూజ్ అయిపోయి అస్సలు మీ గురించి మీరు ఏమనుకుంటారు,అస్సలు అభిరుచులు పంచుకోరా,అభిప్రాయలు ఇచ్చిపుచ్చుకోరా అంటూ ఉత్తి పుణ్యానే గొడవ పెట్టేసుకుంటాను.పాపం ఈయనకేమో తనేమంత ఘోరమైన నేరం చేసారొ అర్ధం కాక కాసేపు జుట్టు పీక్కుని "ఈ ఆడాళ్ళున్నారే!! అస్సలు అర్ధం కారు" అని తను కూడా బాగా కంఫ్యూజ్ అయిపోతారు.ఇంక ఇలా కాదని కిం కర్తవ్యం? అని బాగా ఆలోచించగా చించగా పెద్దల మాట చద్దన్నం మూట అని అర్ధరాత్రి రెండింటికి గుర్తొచ్చి మా అన్నయ్యకి మిసెడ్ కాల్ ఇవ్వగా పాపం ఏం కొంప మునిగిండొ అని వాడు మళ్ళీ ఫోను చేసాడు.
"అన్నయ్యా...................................."
"ఎంటే"
"ఎలా వున్నవురా..?"
"బానే వున్నానే..!నువ్వెలా వున్నావు?"
"ఏదో అలా.. బరువైనా కళ్ళజోడుతో భారంగా బతుకు ఈడుస్తున్నాను."
"ఏంటె బానే వున్నావా..? అయినా ఇంత అర్ధరాత్రి ఆ వాగుడేంటే..?"
"ఏంటన్నయ్య..! నా నయనాల గోడు నీకు వాగుడులా వుందా..?"
"నీ బొంద. ఏమి ఆలొచించకుండా బుద్దిగా పడుకో"
"నా ఆలొచనలన్నీ నా లోచనాల చుట్టూ తిరుగుతుంటే నిద్రెలా వస్తుందన్నయ్యా?"
"ఇంకాపు, నీకేమి కావాలో చెప్పి తగలడు. లేదంటే గుండెపోటొచ్చేట్టుంది నాకు"
"నా కళ్ళకి కళ్ళజోడు నచ్చట్లేదు. లెన్స్ కావలని అవి నన్ను పదే పడే రెక్వెస్ట్ చేస్తున్నయి. నేను నీకు గౌరవం ఇచ్చి నిన్ను అడుగుతున్నా.
బాగా అలోచించి లెన్స్ కొనుక్కో చెల్లీ సలహా ఇవ్వాలరా నువ్వు......"
"ఇంత మాత్రానికి నన్ను అడగడం దేనికే. సర్లే బాగా అలోచించి రేపు చెప్తాలే..." అన్నాడు.
"హన్నా!! ఏంటిరా రేపు చెప్పేది... నేను అల్రెడీ డిసైడ్ అయిపోయా..? రేపటినుండి కళ్ళజోడు పోయి కటకాలొచ్చె డాం డాం డాం. బై" అని డింగుమని ఫోన్ పెట్టేసా...
ఆ వీకెండ్ షాపింగ్ చేసేసి, ఆదివారం తెల్లారుఝామునే అయిదింటికే లేచి, గంటలు గంటలు కుస్తీ పడి నా కళ్ళని పీకి పాకం పెట్టేసి మొత్తానికి కొత్త లెన్స్ ఫిక్స్ చేసిపారేసా. ఎప్పుడూ పొరపాటున కూడా ఆదివారం పూట పది లోపు నిద్ర లేవని మా ఆయన్ని బాది బాది బలవంతంగా నిద్ర లేపేసి మరీ "ఎలా వున్నాను, దయచేసి ఈ విషయంలో అయినా మీ అభిప్రాయం చెప్పండి, నీ ఇష్టం అన్నరంటే మీ మర్యాద దక్కదు "అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. "ఎలా వుండడం ఏంటే.. ఎప్పటిలానే వున్నావు. అసలు ఏం డిఫరెన్స్ లేదు, సేం జిడ్డు మొకం" అన్నారు.. నాకేమో ఘోర అవమానంగా అనిపించేసి ఏడుపు మొకం పెట్టేసి "స్పెక్ట్స్ తీసేసాను, లెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి" అని కొంచెం రిక్వెస్టింగ్ మోడ్ లో అడిగాను.మా హీరో గారేమో తీరిగ్గా "ఓహ్ అవునా.." అని ఓ గంట సేపు కళ్ళు నులుముకుని, ఆవలించి, చిటికెలు వేసి, మెటికలు విరిచి, ఆ తర్వతా రెండంటే రెండు నిముషాలు నా కళ్ళల్లోకి చూసి ఓ పేరు తిరగని హిందీ సినిమా పేరు సినిమా చెప్పి,అందులో హీరోయిన్లా వున్నావన్నారు. అసలా మాటలకి ఉబ్బిపోయేదాన్నే, ఇంతలో నా కళ్లజోడు కథ గుర్తొచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా "నేను అస్సలు ఏమీ అనుకోను. నిజం చెప్పరా ప్లీజ్" అని అడిగాను కొంచెం గారంగా."నువ్విలా మొహమాటపెట్టేస్తే ఈలా చెప్పు. నిజం చెప్పలంటే ఆ సినిమాలో హీరోయినే లేదసలు. అందులో ఓ గున్నేనుగు వుంటుంది. ఈ రోజు నీ కళ్ళు అచ్చు దాని కళ్ళలానే వున్నాయి . అది కూడా నీలానే కళ్ళు తెగ చికిలిస్తూ వుంటుంది సినిమా మొత్తం" అని సెలివిచ్చారు...
అసలా ఆ క్షణంలో ఆయన్ని ఒంగోబెట్టి మరీ వీపు మీద దబీ దబీమని కొట్టాలి అనిపించింది. కానీ పతియే పత్యక్ష దైవంగా భావించే పతివ్రతలు అలా చెయ్యకూడదని గుర్తొచ్చి డ్రాప్ అయిపోయాను.....హ్మ్మ్...ప్చ్..అయ్యో పాపం..అలా నా కటకాలు అటకెక్కాయి. నా కళ్ళద్దాలు మళ్ళీ నా నెత్తికెక్కాయి.
సశేషం...
ఇదో అంతులేని కథ(వ్యధ)
42 comments:
బాగుంది మీ కళ్ళజోడు కహానీ
చాలా బాగుంది.
మీ కళ్ళజోడు భాగోతం చాలా బాగుంది!
mmmmmmmmmmmmmm............
హ హా బాగుంది :)
చాలా చాలా బాగుంది.
ha ha haaaaaaaaaa....baundi..
ba rasaaru...annattu nadi same story...meenakshi
వ్రాసిన విధానం బాగుంది.
సల్లగుంది..(కూల్ అన్నట్టు)
భలే! :)
బావుందండీ మీ కళ్ళజోడు ప్రహాసనం...
మీరు రాసిన విధానం చాలా బాగుంది..
బాగుందండీ. అన్నట్లు నాకూ కళ్ళజోడుంది. చిన్నప్పుడు నేనూ మీలాగే కళ్ళజోడున్నవాళ్ళంతా మేధావులే అన్న ఫీలింగుతో వుండేవాడిని. ఎనిమిదోతరగతినించీ కళ్ళజోడు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తే M.C.A ఆఖరి సంవత్సరంలో వచ్చింది :( పెట్టుకున్నాక అంకులని మాత్రం ఎవ్వరూ అన్లేదులేండి కొంతలో కొంత నయం, హి హి హి!
Too good :)
same club. same feeling ! kani kalla jodu ipudu cool andi. manlanti youth ive pettukuntunnaru. :D
ఏంటోనండీ, ఈమధ్య బ్లాగుల్లో కెలుకుడు తప్ప కామెడీ కనిపించక, ఒక్కసారిగా మళ్ళీ కామెడీ చూసేసరికి చాలా ఆనందంగా ఉంది.
అసలు తోటరాముడు, అశ్విన్, మీనాక్షి, విహారి, రిషి, క్రాంతి, Ofcourse మీరు శ్రీవిద్యగారు కూడా... ఏమైపోయారు ?? You are all being missed here.
నేను కూడా కళ్ళజోడు ఆరాధకురాలినే.ఏడో తరగతిలో వుండగా కళ్ళజోడుకోసం భయంకరమైన తలపోటు తెచ్చుకుంటే చెత్త డాక్టరు కనిపెట్టేసాడు.తరువాత డిగ్రీలో ఏదో అయ్యి కళ్ళజొడు నెత్తికొచ్చింది.ఆర్నెల్లు వాడితే సరిపోద్దన్నారు.ఏదోక ప్లానేసి కళ్ళజోడులో కంటిన్యూ అయిపోదామనుకున్నాను.కానీ అప్పటి నుండి నాకు అదంటే మహా చిరాకు వచ్చేసింది.కానీ డిగ్రీ అయిన నాలుగేళ్ళకి పర్మినెంటుగా తప్పక పెట్టుకోవాల్సివస్తుంది.
మీకోవిషయం చెప్పలేదు కదా నాకెందుకో శ్రీ విధ్య అంటే పెద్ద పెద్ద అద్దాలతో నల్లని బండ ఫ్రేముతో వుండే సినిమా నటి శ్రీవిధ్యే గుర్తొస్తుంది.అదే కల్లజోడులో ఒక యంగ్ ని గర్ల్[మిమ్మల్నే] ఊహించున్నాఇన్నాళ్ళూ.నా ఊహ నిజమైందన్న మాట.
ఆద్యంతం నవ్వి, నవ్వి, ఇక నవ్వలేక చచ్చిపోయానంటే మీరు నమ్మి తీరాలి !
ఎన్నాళ్ళకి మళ్ళీ మమ్మల్ని నవ్వించి పుణ్యం కట్టుకున్నారు శ్రీవిద్య గారు ! ( నా బాధ నవ్వులాటగా ఉందా అనకండేం ? ) మీరు వాడే పదప్రయోగాలు చాలా నవ్విస్తాయి.
అన్నట్టు నాదో ఉచిత సలహా. లెన్స్ కంటే కాళ్ళ జోడే హాయి, లెన్స్ సరిగా కదగాకపోయినా, తీయటం, పెట్టుకోవటం అబ్బో చాలా తలనొప్పి.కంప్లికాషన్స్ వస్తే కళ్ళకి ఇబ్బంది.అదే జోడుతో ఇలాంటి ఇబ్బందులు ఉండవు + కంటి పవర్ పెరగదు. ఇది ఎందరో జీవితాల అనుభవ సారం !
బాగుంది మీ కటకాల కహానీ...మధ్య మధ్యలో హాస్యం ఒలికించిన తీరు బాగుంది.
మీ అందరికీ ఇప్పుడు కళ్ళద్దాల మీద ఇంప్రెషన్ మారిపోయిందిగానీ నాకైతే ఇప్పటికీ అదే ఫీలింగ్. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడైతే మా కాలనీలో అందరూ నేను ఇంజనీరింగ్ లో తెగ కష్టపడి చదవటం వల్ల కళ్ళద్దాలు వచ్చేసాయనుకుని నన్ను పేద్ద తెలివైనవాడిలా చూసేవారు. ఎంతలా ఈ కళ్ళద్దాలు నామీద జనాలకి ఇంప్రెషన్ ని పెంచేసాయంటే నేను ఇంట్లో స్వాతీ వీక్లీ చదువుతున్నా ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతున్నట్టు ఫీలయిపోయేవారు. కాలనీలో ఎవడు చదవకపోయినా మనల్ని గుర్తుచేసి వాడిని ఇంకాస్త ఎక్కువ తిట్టేవారు. ఇంత మంచి రోజులని ఇచ్చాయి నా కళ్ళద్దాలు. So I love them very much...
అదుర్స్!
Sooooper!! :)
చాలారోజులకి మరలా కనిపించారు. అన్నట్టు చెప్పటం మరిచాను మీ శ్రీవారు భార్యాబాధితులసంఘం ప్రదానకార్యాలయం దగ్గర తచ్చాడ్తున్నారని విన్నాను. నిజమేనా? :)
>>అసలు తోటరాముడు, అశ్విన్, మీనాక్షి, విహారి, రిషి, క్రాంతి, Ofcourse మీరు శ్రీవిద్యగారు కూడా... ఏమైపోయారు ??
మేము బ్లాగులకు కొత్త బాబయ్యా...తోటరాముడుని చూసాం కానీ ఈ మిగతా వాళ్ళు తెలీదు బాబయ్యా...ఎవరైనా ఆ బ్లాగుల లింకులిచ్చి పుణ్యం కట్టుకోండి బాబయ్యా...
శ్రీ విద్య గారు చాలా బాగారాసారు..చాలనాళ్ళ తరువాత రాసారు ...బాగుంది :)
అఙ్ఞాత గారు పండగ చేసుకోండి మరి
http://aswinbudaraju.blogspot.com/2008/12/blog-post_08.html
http://meenakshir.blogspot.com/
http://chegodeelu.blogspot.com/2008_10_01_archive.html
ఎన్నాళకెణ్ణాళ్ళకి బ్లాగు వనం నవ్వులతో విరగపూసింది.
బాగుంది మీ నయనాల గోడు!
భలే! :)
హ హ శ్రీవిద్య గారు చాన్నాళ్ళకి కనిపించారు :-) బాగుందండీ.. క క క కళ్ళజోడు.
baavuMdi Srividhya. baa navvukunnaa
Every kallajodu continues to be in the state of rest or of uniform motion unless it is compelled by an external lens. hehehe. Super
బాగుంది మీ కళ్ళజోడు కధ :)
అందరి మాటే నాదీను (మీ బ్లాగ్ సూపరు, మీ కథ కత్తి మరియు మీ కథనం కేక) :). కొన్ని చోట్ల జంధ్యాల గారు తొంగి చూసినా (ఇది కంప్లిమేంటే సుమండీ), మీ స్టైల్ కన్సిస్టెంట్ గా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కీప్ గోయింగ్. (నా వ్యాఖ్య లో ఆంగ్లం కొంచెం ఎక్కువ అయినట్టుంది - మరి రాత్రి పన్నెండుంపావుకి ఇంతకు మించి బుర్ర పని చెయ్యట్లేదు :) ).
[url=http://sunkomutors.net/][img]http://sunkomutors.net/img-add/euro2.jpg[/img][/url]
[b]you buy computer software, [url=http://sunkomutors.net/]buy web design software[/url]
[url=http://sunkomutors.net/][/url] microsoft office teachers discount cheap adobe software
discount software sites [url=http://sunkomutors.net/]buy map software[/url] office software student discount
[url=http://sunkomutors.net/]discount oem software net[/url] filemaker pro 5.5 hack
[url=http://sunkomutors.net/]buy cheap software com[/url] real world camera raw with adobe photoshop cs3
kaspersky online scan [url=http://sunkomutors.net/]software reseller business[/b]
[url=http://sunkomutors.net/][img]http://sunkomutors.net/img-add/euro2.jpg[/img][/url]
[b]sell your software online, [url=http://sunkomutors.net/]campus software discount[/url]
[url=http://sunkomutors.net/][/url] prices for software military discount for microsoft office
oem software illegal [url=http://sunkomutors.net/]which mac is best for photoshop[/url] and shop software
[url=http://sunkomutors.net/]deactivating adobe software[/url] old software store
[url=http://sunkomutors.net/]buy cheap software[/url] buy software for cheap
the software store [url=http://sunkomutors.net/]acdsee pro download free[/b]
[url=http://murudobaros.net/][img]http://murudobaros.net/img-add/euro2.jpg[/img][/url]
[b]windows vista theme, [url=http://murudobaros.net/]windows vista service pack 2[/url]
[url=http://murudobaros.net/]discount microsoft office home and[/url] software to buy selling education software
winzip 12 buy [url=http://murudobaros.net/]quarkxpress filemaker pro[/url] cheap powerpoint software
[url=http://murudobaros.net/]discount software discount game software[/url] buy software online
[url=http://murudobaros.net/]buy cheap softwares[/url] buy chess software
acdsee versus elements [url=http://murudobaros.net/]downloading software[/b]
శ్రీవిద్యగారూ! చాలా రోజులైపోయింది మీరు టపా రాసి. ఇంకెప్పుడు రాస్తారు? ఇక్కడ waiting!!
Where r u madam?
ఏంటంత పురుషాహంకారం,మగ దురహంకారం, ఉల్లిపాయ కారం,సూదిలో దారం
బాబోయ్.... పండించేసారు నవ్వుల పూదోటలని.....
ఎప్పుడైనా.... మా వాళ్ళ ముందు వాడేసుకుంటానని సవినయంగా మనవి చేసుకుంతున్నాను (అర్ధిస్తున్నాను...)
Sri Vidya garu,
Mi blog ni Andhra jyothi lo sankshiptamgaa chusi, ikkadi kocci chadivanu- Chala chala bavundi seili- kathalu rasera? any way-
Congrats & All the best
-కె.గీత
http://kalageeta.wordpress.com/
http://kgeeta.blogspot.com/
http://21stcenturytelugu.blogspot.com/
chala baga chepparu,,
Srividya garu,
I love your blog and the humor in it. Want to share a remedy for good eyesight with you.If you are in India, eat ponnaganti koora daily ( can make pachadi or add in pappu )...ala oka 2 months cheste eyesight normal aipotundi. If you don't get it, then eat other leafy vegetables daily. ( aaku kooralu tinandi ).
Along with that, morning 10 badam pappulu nanesi water lo, night pottu teesi...grind them with mishri, kanda chekkera ( mudda mudda gaa ralla laa unde candysugar, chinna chinna billalu laa undedi kaadu ) and mix it in 1 cup hot milk. So idi badam paalu.( candy sugar 'coz normal sugar is harmful to health, mishri is beneficial )...so ee paalu tagesaaka konchem ( around 1 tablespoon) saunf with mishri tinandi. ala 2 months cheste you can see lot of improvement.
Naaku light eyesight unnappudu cheste , 2 months ki glasses pakkana padesaa...eyesight ekkuva unte inkonni months extra cheyalsi ravochu like 3 or 4 months but surely it works. oka vela 4 months pattinaa glasses lekunda hayiga unte antha kante inkem kavali. Konchem disciplined gaa cheyaali mari. Chestaaru kaduuu ...
Also roju triphala churnam 1 teaspoon ala konchem water lo nanesi night, aa water tho morning eyes close chesi aa water challandi eyes meeda ( water should be cold or room temperature , challani neeru not as in fridge water )...idi kooda cheste fast gaa results ostaayi.Chestaaru kaduuu ...
Post a Comment